సాక్షి, అమరావతి : నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సరిగా తెలుగు మాట్లాడటమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టి, ఎవరు దళిత పక్షపాతో.. ఎవరు దళిత ద్రోహో! దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న మీ నాన్నారుని అడుగు చెప్తారు, దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూస్కో లోకేశం’అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి గురువారం ట్వీట్ చేశారు. (‘ప్రజల చీత్కారానికి గురైన మీకు సిల్వర్ జూబ్లీ విషెస్’)
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి నివాసానికి వెళ్తుండగా గూడవల్లి నిడమానూరు మధ్య రహదారిపై అంబులెన్స్‌కు దారి ఇచ్చి ఒక ప్రాణాన్ని రక్షించారన్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపివేశాడని, చంద్రబాబు చేసిన పని వల్ల కాకినాడ దగ్గర ఓ పేషెంట్ మృతి చెందాడని గుర్తు చేశారు. ఈ సంఘటనే ప్రజల ముఖ్యమంత్రికి(వైఎస్ జగన్), మీడియా తయారు చేసిన మాజీ సీఎం(చంద్రబాబు)కు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment