
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చే వలస పక్షుల సందడి రాష్ట్రంలో మొదలైంది. లాక్‌డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు కూడా పనుల్లో చేరేందుకు వెనక్కి తిరిగొస్తున్నారు. ప్రవాసంలో ఉన్న తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో తలుపులు బిగించుకుని ఇంట్లో దాక్కున్నారు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ('టీడీపీ క్యాడర్ నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతోంది')
మరో ట్వీట్‌లో... 'ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం, విశాఖలో పాలనా రాజధాని పెట్టడం ఇష్టం లేని కొందరు విషం చిమ్ముతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై కుట్రలు పన్నుతున్నారు. జనాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్న వారి పప్పులుడకవు. కొన్ని వర్గాల కబ్జాలు, అక్రమాల నుంచి విశాఖ బయటపడుతోంది' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ('విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది')
Comments
Please login to add a commentAdd a comment