
సాక్షి, అమరావతి : ‘చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో తుప్పు నాయుడుకు చరమగీతమే’ అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం వరుస ట్వీట్లతో బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘ ఆయనేం పీకాడు, ఈయనేం పీకాడంటూ దిగజారి మాట్లాడుతున్నావు. నీకు కుప్పంలోనే జనం పీకేస్తున్నారు బాబూ. నిమిషంలో రాజీనామా అంటున్నావ్, నీ ‘రాజీ’ డ్రామాలు జనం చాలా చూశారు. నీ త్యాగాలేంటో సమైక్యాంధ్ర ఉద్యమంతోనే తేలిపోయింది. కులాలను రెచ్చగొట్టడానికి వైజాగ్ వచ్చావా? స్టీల్ ప్లాంట్ కోసమా?’’
‘‘ చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో తుప్పు నాయుడుకు చరమగీతమే. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీకి జనమే ఆక్సిజన్ పీకేస్తారు. పేదలకు ఇళ్లు, అమ్మ ఒడి ఆపడానికి కూడా కోర్టుల్లో పిల్స్ వేయించిన నీచుడువు నువ్వు కాదా కుట్రల నాయుడు? ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలతో నీ నవరంధ్రాలు మూతపడ్డాయి చంద్రబాబూ. ’’
‘‘మూడో విడతలోనూ టీడీపీని మడత పెట్టేశారు. 85 శాతం పైగా పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మాత్రం క్లారిటీతో ఉన్నారు. పచ్చ మీడియా జాకీలేసి లేపినా...ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.’’
‘‘ 54 ప్రభుత్వ కంపెనీలను అమ్మిన తుక్కు బాబు విశాఖ ఉక్కు కోసం పోరాడతాడంట. విశాఖను పాలనా రాజధాని చేస్తామనగానే విషం చిమ్మాడు. సునామీలు, భూకంపాలొస్తాయంటూ పచ్చ కుల మీడియాలో ..విషపు రాతలు రాయించాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిలదీయాల్సింది ఎవర్ని బాబూ?’’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment