
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామ వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్లను గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విటర్ వేదికగా.. 'గ్రామ వాలంటీర్లెంత, వాళ్ల జీతాలెంత.. పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని చంద్రబాబు హేళన చేశారని అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. గ్రామ వాలంటీర్లందరికి హాట్సాఫ్' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ: విజయసాయి రెడ్డి
కాగా మరో ట్వీట్‌లో 'తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్‌లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చదవండి: వణికి చచ్చేట్టున్నారు!: విజయసాయి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment