మాట్లాడుతున్న భిక్షమయ్యగౌడ్
సాక్షి,బొమ్మలరామారం : అమరుల ఆత్మ బలిదానాలు, సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూఢిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గురువారం జరిగిన గడపగడపకు కాంగ్రెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షామీర్‌పేట్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి బొమ్మలరామారం మండలానికి సాగు నీరు అందిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు సంగతి దేవుడెరుగు బాత్ రూం బిల్లులే రావడం లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, వారి కుటుంభాలకు ముడెకరాల భూ పంపిణీ చేస్తామని మోసం చేసిన కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏక కాలంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశారన్నారు. రేషన్ కార్డు గల కుటుంబానికి 6 ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి వ్యక్తికి ఏడు కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఐదు లక్షలవ్యయంతో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3 వేల జీవన భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, మాందాల రామస్వామి, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మహదేవుని రాజు, మోటే వెంకటేష్, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బోయిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, బాసారం బాబు,మోహన్ నాయక్, జూపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment