loan waived
-
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు -
వీర జవాన్ల రుణాలను మాఫీ చేసిన ఎస్బీఐ!
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం సైనికు కుటుంబాలకు అండగా నిలిచింది. దేశం నలువైపుల నుంచి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 సైనికులు తమ వద్ద తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు అంతేకాకుండా.. రూ.30లక్షల ఇన్సూరెన్స్ డబ్బును ప్రతీ సైనిక కుటుంబానికి అందజేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. పుల్వామా ఉగ్రదాడి ఎంతో బాధాకారమైందని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. తమ సంస్థలో పనిచేసే వారంతా విరాళాలు ఇవ్వాలని ఎస్బీఐ కోరింది. -
త్యాగాలు కాంగ్రెస్‌వి..భోగాలు కేసీఆర్‌వి..
సాక్షి,బొమ్మలరామారం : అమరుల ఆత్మ బలిదానాలు, సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూఢిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గురువారం జరిగిన గడపగడపకు కాంగ్రెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షామీర్పేట్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి బొమ్మలరామారం మండలానికి సాగు నీరు అందిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు సంగతి దేవుడెరుగు బాత్ రూం బిల్లులే రావడం లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, వారి కుటుంభాలకు ముడెకరాల భూ పంపిణీ చేస్తామని మోసం చేసిన కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏక కాలంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశారన్నారు. రేషన్ కార్డు గల కుటుంబానికి 6 ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి వ్యక్తికి ఏడు కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఐదు లక్షలవ్యయంతో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3 వేల జీవన భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, మాందాల రామస్వామి, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మహదేవుని రాజు, మోటే వెంకటేష్, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బోయిన్పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, బాసారం బాబు,మోహన్ నాయక్, జూపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. లక్ష రుణం మాఫీకి కట్టుబడాలి
వాగ్దానాలు విస్మరించిన పార్టీల గుర్తింపు రద్దు చేయాలి రైతు సంఘాల డిమాండ్ హైదరాబాద్: రైతులకు రూ.లక్ష వరకు రుణం మాఫీ చేసేలా రాజకీయ పార్టీలు హామీ ఇవ్వాలని, ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికల్లోనూ చేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మేనిఫెస్టోలోని వాగ్దానాలను విస్మరించే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. ‘2014 ఎన్నికలు- పార్టీ ప్రణాళికల్లో పొందు పర్చాల్సిన అంశాల’పై మంగళవారం హైదరాబాద్‌లో సీపీఐ అనుబంధ రైతు సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిం చింది. సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కె.నారాయణ (సీపీఐ), బి.చంద్రారెడ్డి (సీపీఎం అనుబంధ రైతుసంఘం), ఎం.కోదండరెడ్డి (కాంగ్రెస్ కిసాన్‌సెల్), ఎంవీఎస్ నాగిరెడ్డి (వైఎస్సార్సీపీ రైతు విభాగం), ఎన్.వెంకటేశ్వరరావు (టీడీపీ రైతు సంఘం), శ్యాంకిషోర్ (బీజే పీ కిసాన్‌మోర్చా), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ), డాక్టర్ డి.నరసింహారెడ్డి (చేతనసొసైటీ), కిరణ్ (ఆమ్ ఆద్మీ), ఎస్.సురేష్‌రెడ్డి (బీజేపీ), రావుల వెంకయ్య, కె.రామకృష్ణ (ఏపీ రైతు సంఘం) తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రతిపాదించిన అంశాలను తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని నారాయణ హామీ ఇచ్చారు. రైతు ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు రుణం మాఫీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించేలా పార్టీల ప్రణాళికలు ఉండాలని కోరింది. రైతులకు ఇచ్చే రుణాలపై ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా చట్టాలు తేవాలని డిమాండ్ చేసింది. 55 ఏళ్లు నిండిన ప్రతి రైతు, రైతు కూలీకి నెలకు రూ. 3వేల పింఛన్ సౌకర్యం కల్పించాలని సమావేశం తీర్మానించింది. -
టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ
నార్నూర్, న్యూస్‌లైన్ : రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన తొలి సంతకం రైతుల రుణ మాఫీ ఫైల్‌పైనే చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. ఎంపీ చేపట్టిన 100 రోజుల పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని మహగావ్, గుండాల, చోర్గావ్, ఖైర్‌డట్వా, ఖడ్కి, లొకారి(కె), ఝరి, గాదిగూడ, పర్సువాడ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శేకుగూడ గ్రామంలో రైతులు ఎండ బెట్టిన సోయా విత్తనాలను పరిశీలించి, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌కు తొత్తుగా మారి గిరిజనులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ఎంపీ వెంట తహశీల్దార్ సూర్యనారాయణ, ఐటీడీఏ డీఈ తానాజీ, హౌసింగ్ డీఈ నజీమొద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శ్రీనివాస్, పీఆర్ జేఈ లింగన్న, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్, మాజీ జెడ్పీటీసీ జాలంసింగ్, సహకార సంఘం చైర్మన్ కాంబ్లె నాందేవ్, టీడీపీ మండల అధ్యక్షుడు మోతె రాజన్న, సర్పంచులు రాథోడ్ మధుకర్, రాజునాయక్, దాదారావ్, నాయకులు పాల్గొన్నారు.