సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం సైనికు కుటుంబాలకు అండగా నిలిచింది. దేశం నలువైపుల నుంచి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 సైనికులు తమ వద్ద తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు అంతేకాకుండా.. రూ.30లక్షల ఇన్సూరెన్స్ డబ్బును ప్రతీ సైనిక కుటుంబానికి అందజేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. పుల్వామా ఉగ్రదాడి ఎంతో బాధాకారమైందని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. తమ సంస్థలో పనిచేసే వారంతా విరాళాలు ఇవ్వాలని ఎస్‌బీఐ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment