నార్నూర్, న్యూస్‌లైన్ : రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన తొలి సంతకం రైతుల రుణ మాఫీ ఫైల్‌పైనే చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. ఎంపీ చేపట్టిన 100 రోజుల పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని మహగావ్, గుండాల, చోర్‌గావ్, ఖైర్‌డట్వా, ఖడ్కి, లొకారి(కె), ఝరి, గాదిగూడ, పర్సువాడ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శేకుగూడ గ్రామంలో రైతులు ఎండ బెట్టిన సోయా విత్తనాలను పరిశీలించి, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌కు తొత్తుగా మారి గిరిజనులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ఎంపీ వెంట తహశీల్దార్ సూర్యనారాయణ, ఐటీడీఏ డీఈ తానాజీ, హౌసింగ్ డీఈ నజీమొద్దీన్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ శ్రీనివాస్, పీఆర్ జేఈ లింగన్న, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్, మాజీ జెడ్పీటీసీ జాలంసింగ్, సహకార సంఘం చైర్మన్ కాంబ్లె నాందేవ్, టీడీపీ మండల అధ్యక్షుడు మోతె రాజన్న, సర్పంచులు రాథోడ్ మధుకర్, రాజునాయక్, దాదారావ్, నాయకులు పాల్గొన్నారు.