అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాము. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ధర పెంచబోమని ప్రధాని 'నరేంద్ర మోదీ' హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత 'రాహుల్ గాంధీ' దేశానికి ఐదు హామీలు ఇచ్చారు. వాటన్నంటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు.. చెన్నైలోని కాంగ్రెస్ రాష్ట్ర సత్యమూర్తి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు.
30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కాంగ్రెస్ చర్య తీసుకుంటుందని చిదంబరం వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి చర్యలను అరికట్టడానికి కూడా కొత్త చట్టం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
గ్యాస్ ధరలను రూ. 100 తగ్గించిన బీజేపీ ప్రభుత్వం.. ఇంధన ధరల తగ్గింపు, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలను ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చిదంబరం మండిపడ్డారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 7 వరకు, తమిళనాడుకు రూ. 17,300 కోట్లతో సహా దేశానికి రూ. 5.90 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు, వీటి ప్రస్తావన నాకు కనిపించలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment