గ్యాస్‌ సబ్సిడీపై జీఎస్‌టీ ‘బండ’ | LPG costlier on GST, lower subsidy | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సబ్సిడీపై జీఎస్‌టీ ‘బండ’

Published Mon, Jul 3 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

గ్యాస్‌ సబ్సిడీపై జీఎస్‌టీ ‘బండ’

గ్యాస్‌ సబ్సిడీపై జీఎస్‌టీ ‘బండ’

న్యూడిల్లీ: జీఎస్‌టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన ‘బండ’ పడింది. వస్తు, సేవల పన్ను ప్రభావంతో వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గణనీయంగా తగ్గనుందని తెలుస్తోంది.   వంట గ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెల రూ. 32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రూ.107మాత్రమే సబ్సిడీ రానుందని అఖిల భారత జాతీయ ఎల్‌పీజీ పంపిణీదారులు ఫెడరేషన్ కార్యదర్శి విపుల్ పురోహిత్  చెప్పారు. ఫలితంగా జూలై నుంచి ప్రతి వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్‌కు 32 రూపాయల వరకు భారం పడనుంది. దీంతోపాటు కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు  రెండు సంవత్సరాల మాండేటరీ  ఇన్స్‌పెక్షన్, ఇన్‌స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలనున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  ఇక  సెకండ్‌ సిలిండర్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు.

జీఎస్‌టీ ప్రకారం ఎల్‌పీజీ  5 శాతం పన్ను పరిధిలో ఉంది.  గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర రూ.12-15 వరకు పెరిగే అవకాశం ఉంది.  మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు రూ.119.85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో రూ.107 మాత్రమే పడనుంది.  మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్‌పై వినియోగదారులకు రూ.32 వరకు  జీఎస్‌టీ బండ పడే అవకాశాలు ఖాయం. రవాణా మరియు లాజిస్టిక్స్ వంటి వేరియబుల్ ఖర్చులు కారణంగా ఇతర రాష్ట్రాలలో ధరలలో చిన్న వ్యత్యాసం  ఉండనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement