వంటగ్యాస్ పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం జిల్లాలో అమలయ్యేపరిస్థితి కనిపించడం లేదు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో జనవరి 1 నుంచి నగదు బదిలీ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
నల్లగొండ : నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ....ఇక కేంద్రం వంట గ్యాస్ రాయితీని వినియోగదారుల ఖాతాలో నేరుగా జమ చేయాలన్న ఉద్దేశంతో నగదు బదిలీకి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అప్పట్లో ఆపేశారు. అయితే గ్యాస్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న మోదీ ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని వచ్చే జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. కానీ
మొత్తం కనెక్షన్లు 5.20 లక్షలు...
జిల్లాలో ఐఓసీ, హెచ్‌పీ, బీపీఎల్ కంపెనీల పరిధిలో మొత్తం 5,20,270 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీపం పథకానికి సంబంధించి మరో 1,79,953 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5,20,270 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతోపాటు, బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
నత్తనడకన ఆధార్ సీడింగ్ ...
ఆధార్ సీడింగ్‌పై ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన లేకపోవడంతో నమోదు నత్తనడకన సాగుతోంది. 5.20 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 3.92 లక్షల కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానం చేశారు. వీటిలో ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 2.43 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్ సీడింగ్‌తో అనుసంధానమయ్యాయి. మొత్తంగా జిల్లాలో ఇంకా 4,56,571 కనెక్షన్లు ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు అధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే జనవరి నాటికి ఆధార్‌కార్డు అనుసంధానించకపోయినా బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల మూడు మాసాల వరకు వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేసే వెసులుబాటు ఉంటుందని వారు తెలిపారు. అయితే ఆధార్ సీడింగ్ పూర్తయితే తప్ప నగదు బదిలీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
దూరాన్ని బట్టి ధర..
ప్రస్తుతం గ్యాస్ ధరను దూరాన్ని బట్టి రవాణా ఖర్చులను కలుపుకొని నిర్ణయిస్తారు. ప్రస్తుతం జిల్లాలో సిలిండర్ ధర రూ.957గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ చెల్లిస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.510 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది.
ఐఓసీ 2,95,624
హెచ్‌పీసీఎల్ 1,41,149
బీపీఎల్ 83,497
దీపం కనెక్షన్లు 1,79,953
గ్యాస్ కనెక్షన్లు మొత్తం 7,00,223
నగదు బదిలీ అయ్యేనా?
Published Sun, Dec 28 2014 1:35 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement