న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. సబ్సిడీ ఉన్న సిలిండర్‌పై రూ.5.91, సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ధరల తగ్గుదల నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల బరువున్న సబ్సిడీ సిలిండర్ రూ.494.99కు, సబ్సిడీలేని సిలిండర్ రూ.689కు అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం ధరల్లో తగ్గుదలతో పాటు రూపాయి మారకం విలువ బలపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment