వంట గ్యాస్ నగదు బదిలీకి నో!
- ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి ముందుకురాని వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్న వంట గ్యాస్ నగదు బది లీకి వినియోగదారులు నిరాసక్తత కనబరుస్తున్నా రు. నగదు బదిలీ కోసం ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలు ఇవ్వాల్సి ఉన్నా వినియోగదారులు పెద్ద గా ముందుకు రావడంలేదు. పెద్దమొత్తంలో సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం, రాయితీ, రాయితీయేతర సిలిండర్ ధరల మధ్య వ్యాట్ వ్యత్యాసం ఉండటం, సకాలంలో ఖాతాలో రాయి తీ జమకాకపోవడంవంటి కారణాలరీత్యా విని యోగదారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న నగదు బదిలీ అమలు ఎలా సాధ్యమన్నది అంతుపట్టడం లేదు. నవంబర్ 15 నుంచే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలయింది. మూడు జిల్లాల పరి ధిలో ఇప్పటికే 32.71లక్షల మంది వినియోగదారులు ఈ పథకం పరిధిలోకి రాగా, జనవరి నుంచి మొత్తంగా 61.99 లక్షల మంది రానున్నారు. ఎల్పీజీ కనెక్షన్‌కు బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలోనే జమ అవుతుంది.
ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతా నంబర్ డీలర్‌కు ఇస్తే ఆ ఖాతాలో రాయితీ జమ అవుతుంది. మొదటి మూడు నెలల్లో ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాతి మూడు నెలలపాటు రాయితీ ధరకు ఇవ్వరు కానీ ఈ రాయితీని బ్యాం కు ఖాతాను ఎప్పుడైతే అనుసంధానిస్తే అప్పుడు రాయితీ మొత్తాన్నంతా ఖాతాలో జమచేస్తారు. దీనిపై పౌర సరఫరాల శాఖ, చమురు కంపెనీలు, బ్యాంకులు విసృ్తత ప్రచారం జరిపినా ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి వినియోగదారుల నుంచి స్పందన రాలేదు.
ప్రస్తుతం రూ.444 చెల్లించి సిలిండర్ పొందుతుండగా, నగదు బదిలీ కింద రూ.832 చెల్లించాలి. దీనికితోడు అదనంగా రూ.19 వరకు వ్యాట్ భారం పడి రావాల్సిన సబ్సిడీ కన్నా తక్కువ మొత్తం ఖాతాల్లో జమ అవుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం మౌనంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు నగదు బదిలీపై ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా సిలిండర్ పొందిన 10 నుంచి 15 రోజులకు గానీ రాయితీ జమ కావడం లేదని గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ నమోదు 75.72 శాతం, బ్యాంకు సీడింగ్ కేవలం 57.12 శాతం మాత్రమే నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆధార్ సీడింగ్ 59.24 శాతం, బ్యాంక్ సీడింగ్ కేవలం 27.25 శాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌లో మొత్తం 13,54,101 వినియోగదారులు ఉండగా 11,31,592 మంది ఆధార్ నమోదు చేయించుకున్నారు.