గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు? | LPG to cost Rs.250 more per cylinder? | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?

Published Fri, Jul 4 2014 3:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు? - Sakshi

గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?

ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? అయితే.. మళ్లీ కట్టెలు కొనుక్కుని దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్కు రూ. 250 చొప్పున పెంచాలని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ దృష్టికి చమురు మంత్రిత్వశాఖ తీసుకెళ్లనుంది. కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరలను నిపుణుల కమిటీ సూచించిన మేరకు పెంచాలని ఈ శాఖ భావిస్తోంది.

గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు కిరోసిన్ను లీటరుకు రూ. 4-5 చొప్పున, గ్యాస్ సిలిండర్లను సిలిండర్కు రూ. 250 చొప్పున పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్నే కేబినెట్ కమిటీకి నివేదిస్తోంది. ఇక నెలకు డీజిల్ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కొనసాగించాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు.. ఇక సిలిండర్ల మీద భారీ వడ్డన తప్పకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగానే పరిణమిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement