
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది.
బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు!
అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్‌పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది.
కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే.
చదవండి: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్!