lpg cylinder
-
ఎన్నికల ముంగిట.. వంట గ్యాస్‌పై శుభవార్త!
లోక్‌సభ ఎన్నికల ముంగిట వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద భారత ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించవచ్చని సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక పేర్కొంది. కొత్త కనెక్షన్ల కోసం అందించే సొమ్మే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన వినియోగదారులకు ప్రతి ఎల్పీజీ సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తోంది. ఇది గతంలో రూ.100 ఉండగా 2023 అక్టోబరులో రూ.300కి పెంచారు. సబ్సిడీని ఒక సంవత్సరం పొడిగించడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.12,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఉజ్వల పథకం ప్రయోజనాలు ఇలా.. ప్రభుత్వం అర్హులైన పేదలకు 14.2 కిలోల సిలిండర్‌తో ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్‌కు రూ.1600 నగదు బదిలీ చేస్తుంది. ఇదే 5 కిలోల సిలిండర్‌కైతే రూ.1150 అందిస్తోంది. ఇందులో సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ - 14.2 కిలోల సిలిండర్‌కు రూ.1250, 5 కిలోల సిలిండర్‌కైతే రూ.800, రెగ్యులేటర్ కోసం రూ.150, ఎల్పీజీ ట్యూబ్ కోసం రూ.100, డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్ కోసం రూ.25, ఇన్‌స్పక్షన్, ఇన్స్టాలేషన్ చార్జీ కింద రూ.75 ఉంటాయి. వీటన్నంటినీ ప్రభుత్వమే భరిస్తోంది. -
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్‌సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్
LPG price by Rs 400/cylinder బీజేపీ సర్కార్ హయాంలో ఇటీవలి కాలంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి సామాన్యుడికి పెనుభారంగా మారడంతో బీజేపీ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించింది. అలాగే పిఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200 లభించనుంది. దీంతో PMUY ఖాతాదారులకందే సబ్సిడీ రూ.400 అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ మహిళలకు అందించిన రక్షాబంధన కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎల్పిజి సీలిండర్ ధర తగ్గింపు రాబోయే ఎన్నికలకు సంబంధించినదేనా అన్నదానిపై స్పందించిన ఠాకూర్ అలా అనుకుంటే ముందే తగ్గించే వాళ్లం అంటూ ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సౌదీ CP (కాంట్రాక్ట్ ధరలు) ధరలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2022 నుండి 303 శాతం పెరిగింది. కానీ తాము మాత్రం 63 శాతం మాత్రమే పెంచి కొంత ఉపశమనం కలిగించామంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోట్లాది వినియోగదారుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,100 కోట్లు కేటాయించామని, 2023-24 సంవత్సరానికి ఆర్థిక ప్రభావం రూ. 7,680 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రూ. 1,103గా ఉంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సిలిండర్‌కు రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే. "Government has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders for all LPG consumers" -Union Minister @ianuragthakur#CabinetDecisions #LPGcylinder pic.twitter.com/sfwTyxUlsN — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 29, 2023 ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు హైదరాబాద్ రూ. 1,155.00 ముంబై రూ. 1,102.50 గుర్గావ్ రూ. 1,111.50 బెంగళూరు రూ. 1,105.50 చండీగడ్ రూ. 1,112.50 జైపూర్ రూ. 1,106.50 పాట్నా రూ. 1,201.00 కోలకత్తా రూ. 1,129.00 చెన్నై రూ. 1,118.50 నోయిడా రూ. 1,100.50 భువనేశ్వర్ రూ. 1,129.00 లక్నో రూ. 1,140.50 త్రివేండ్రం రూ. 1,112.00 -
China: గ్యాస్ బండ పేలి 31 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం. నార్త్‌వెస్ట్రన్ నగరం ఇంచువాన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న రెస్టారెంట్.. జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్‌లోని గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే యత్నం చేశాయి. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి. స్వయంప్రతిపత్తి ఉన్న నింగ్క్సియా రాజధాని ప్రాంతమే ఇంచువాన్. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కోసం మూడురోజులపాటు సెలవులు ప్రకటించారక్కడ. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చినవాళ్లే ఎక్కువగా మృతుల్లో ఉన్నారు. ఇంచువాన్‌లో ప్రమాదం జరిగిన ఓవైపు ఈ వీధిలో గ్లాస్ ముక్కలు, చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు.. మరోపక్క అయినవాళ్ల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న బంధువుల రోదనలతో హృదయ విదారకమైన దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఘటనపై అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని, ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 🇨🇳 | URGENTE: Al menos 31 muertos en una explosión en un restaurante en la ciudad de Yinchuan, en el noroeste de China.#yinchuan #China #URGENTE #ULTIMAHORA pic.twitter.com/ZMnLqI2VfF — eljournalnews.ec (@eljournalnewsec) June 22, 2023 Al menos 31 personas murieron después de una explosión de gas en un restaurante de barbacoa en #Yinchuan, capital de la Región Autónoma Ningxia Hui del noroeste de #China, la noche de este #miércoles, según informes de los medios locales citando a las autoridades pic.twitter.com/scC1QeJGWg — @UlisesMtv (@UlisesMtv) June 22, 2023 ఇదీ చదవండి: ఏం ఎండలురా భయ్.. మాడిపోతోందీ మనోళ్లే! -
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
గుడ్‌న్యూస్: గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై 4 ఆఫర్లు, రూ.1000 వరకు తగ్గింపు!
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. సిలిండర్ బుకింగ్‌పై మీకోసం పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm). ఈ యాప్‌ను ఉపయోగించి ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ద్వారా రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌పై 4 రకాల ఆఫర్లను ప్రవేశపెట్టింది పేటీఎం. వీటిని ఉపయోగించి కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అనగా రూ. 5 నుంచి రూ. 1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు. ఈ ఆఫర్లను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం! మొదటి క్యాష్‌బ్యాక్ ఆఫర్ కోసం ప్రోమోకోడ్ GAS1000. ఈ ప్రోమోకోడ్‌ని ఉపయోగించి కస్టమర్ రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా FREEGAS ప్రోమోకోడ్తో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న ప్రతి 500వ వినియోగదారునికి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఏయూ క్రెడిట్ కార్డ్‌తో (AU Credit card) సిలిండర్‌ను చెల్లింపుపై పేటీఎం రూ.50 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ ప్రోమోకోడ్ AUCC50. వీటితో పాటు యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో (YES Bank Credit Card) గ్యాస్ సిలిండర్ చెల్లింపుపై రూ.30 తగ్గింపు లభిస్తుంది. దీని కోసం బుకింగ్ చేసేటప్పుడు GASYESCC ప్రోమోకోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా వీటి ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉండే అవకాశం ఉంది. చదవండి భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వెలుడుతున్నాయి. దీనికి తోడు తగ్గుతున్న చమురు ధరలు ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి. (షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?) వంట గ్యాస్‌ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా సీఎన్జీ, ఎల్పీసీ గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉందని అంచనా. గత కొంత కాలంగా కోవిడ్ మహమ్మారి, ఇటీవలి భౌగోళిక రాజకీయ సంక్షోభం గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరల నియంత్రణకు సెప్టెంబరులో ఏర్పాటైన కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని కమిటీ నవంబర్ 29న ప్యానెల్ సభ్యులు తమ సిఫార్సులను సమర్పించనున్నారు. ఈ అంచనాలు నిజమైతే సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. (ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ) కాగా ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం తెలిసిన సంగతే. గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్!
ఇటీవలే నిత్యవసరాల వస్తువులకు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా గ్యాస్ సిలిండర్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చి మరో ఊహించని షాక్ ఇవ్వనుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం... వినియోగదారులు ఇకపై ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా.. మార్పులు చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా..ప్రచారం మాత్రం సాగుతోంది. ఇదిలా ఉంటే.. దేశంలో నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకురాబోయే చట్టం ప్రకారం.. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరమైతే.. వినియోగదారులు సిలిండర్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలపడంతో పాటు నిర్ధేశించిన డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వీటి డిమాండ్‌ని పరిశీలిస్తే.. జూలై 1, 2021, జూలై 6, 2022 మధ్య 12 నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. జూలై 2021లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 834 ఉండగా, జూలై 2022 నాటికి , 26 శాతం పెరిగి రూ.1,053కి చేరుకుంది. ఎల్పీజీ( LPG)) సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ ఆ రాష్ట్రంలో విధించే పన్నులతో పాటు రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కూడా ముడి చమురు ధరల ఆధారంగా లెక్కిస్తారు. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
రేషన్‌లో మినీ సిలిండర్లు
సాక్షి, నారాయణపేట: కనీస నిర్వహణ ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్న రేషన్ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్నెట్ కేఫ్, సిటిజన్ చార్జ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా డీలర్లకు కొంత కమీషన్ ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు.. పేదలకు కొంత వరకు ఉపశమనం కలిగించనున్నారు. జిల్లాలో 247 దుకాణాలు.. జిల్లాలోని 11 మండలాల్లో 247 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గతంలో బియ్యంతోపాటు పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులు సరఫరా చేసిన చౌకధర దుకాణాలు ప్రస్తుతం బియ్యం మాత్రమే అందిస్తున్నాయి. 50 కిలోల బియ్యంలో మూడు నుంచి నాలుగు కిలోల తరుగు రావడంతో వచ్చిన కమీషన్ తరుగుకు సరిపోతుందని, నెల మొత్తం కష్టపడితే ఖాళీ సంచులు మాత్రమే మిగులుతున్నాయని, దీనికి తోడు కొందరు గ్రామాల్లో తిరిగి లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్‌కు పాల్పడితే తాము నిందపడాల్సి వస్తుందని కొద్ది రోజులుగా డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. కమీషన్ రూ.41.. రేషన్ దుకాణం ద్వారా కార్డుదారులతోపాటు ఆధార్‌కార్డు కలిగిన వారికి 5 కిలోల మినీ సిలిండర్లు సరఫరా చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ మాదిరిగానే మినీ సిలిండర్లను సైతం తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి సిలిండర్ తీసుకున్న సమయంలో ఒక్క సిలిండర్‌కు రూ.940 చెల్లించాలని, తర్వాత నెల నుంచి రూ.620కే అందిస్తామని తెలిపారు. దీనిలో గ్యాస్ డీలర్‌కు ఒక సిలిండర్‌కు రూ.41 కమీషన్ ఇవ్వనున్నారు. నెలలో ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తారు. రేషన్ డీలర్ 20 సిలిండర్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. అందుబాటులోకి పౌర సేవలు.. రేషన్ దుకాణాల్లో ఇంటర్నెట్ కేఫ్‌లు, పౌరసేవా పత్రం ద్వారా 14 రకాల సేవలను అందుబాటులోకి తేనున్నారు. తద్వారా కొంత కమీషన్ రూపంలో డీలర్లకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రేషన్ దుకాణాలకు పీఎం వాణి కేంద్రాలుగా నామకరణం చేయనున్నట్లు సమాచారం. -
రేషన్ షాపుల్లో 5 కిలోల సిలిండర్
సాక్షి, హైదరాబాద్ : గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు, బ్యాచిలర్లు, వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా అయిదు కిలోల వంటగ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆయిల్ కంపెనిలన్నీ తమ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకుల ద్వారా వీటిని విక్రయిస్తుండగా, త్వరలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులో తెచ్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహాపయోగం కోసం 14.2 కిలోల, వాణిజ్య అవసరాల కోసం 19 కిలోల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. చిన్న సిలిండర్లు డోర్ డెలివరీ లేనప్పటికీ ఖాళీ సిలిండర్ తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీలు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నుంచి రీఫిల్ చేసి తీసుకునే వెసులుబాటుంది. తాజాగా రేషన్ దుకాణాల్లోకి అందుబాటులోకి వస్తే అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్న గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చమురు సంస్థల వంట గ్యాస్‌ను బట్టి చిన్న సిలిండర్ ధర ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 5 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన చిన్న సిలిండర్ రూ.528.32కు లభిస్తుందని సమాచారం. (క్లిక్: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు..) -
ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఇలా పొందండి..!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తన యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం యాప్ నుంచి ఎల్పీజీ సిలిండర్స్ బుక్ చేసుకునే యూజర్ల కోసం అద్భుతమైన డీల్స్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఎల్బీజీ వినియోగదారులకోసం పేటీఎం మూడు సరికొత్త ప్రొమోకోడ్స్ను తీసుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్ను అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చును. మొదటి ప్రొమో కోడ్(BANKBANG)లో భాగంగా పేటీఎం యూజర్లు రూ. 25 డిస్కౌంట్‌ను పొందవచ్చును. ఈ ఆఫర్ కేవలం డెబిట్ కార్డుతో చెల్లింపు జరిపినప్పుడే డిస్కౌంట్ వస్తోంది. రెండో ప్రోమో కోడ్(FIRSTCYLINDER)తో రూ.30 పేటీఎం క్యాష్‌బ్యాక్ యూజర్లకు రానుంది. మూడో ప్రొమో కోడ్‌లో భాగంగా ఉచితంగానే సిలిండర్‌ను పొందవచ్చును. ఉచితంగా సిలిండర్..! ఎల్పీజీ కస్టమర్లకోసం పేటీఎం సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. పేటీఎం యూజర్లకు ఎల్పీజీ సిలిండర్లను బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్, ఇంధనే వంటి గ్యాస్ సిలిండర్లను పేటీఎం యూజర్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు (FREECYLINDER) అనే ప్రోమోకోడ్‌ను సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో అప్లై చేయడంతో ఉచితంగా సిలిండర్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రోమోకొడ్తో చెల్లించిన మొత్తాన్ని పేటీఎం క్యాష్‌బ్యాక్ రూపంలో పూర్తిగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రతి 100 వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి వర్తించనుంది. గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు పొందవచ్చు. అంటే యూజర్లు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుది. ఫిబ్రవరి 28, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు 100వ లక్కీ కస్టమర్ అయితే.. 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా బుక్ చేయండి..! ముందుగా పేటీఎం యాప్‌ను ఒపెన్ చేయండి ‘బుక్ మై సిలిండర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ లేదా కస్టమర్ నెంబర్‌ను నమోదుచేసిన తర్వాత... మీ ఏజెన్సీ గురించి మీకు సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ చేయడంతో మీ బుకింగ్ పూర్తవుతుంది. బుకింగ్ సమయంలో ప్రొమో కోడ్ అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చును. చదవండి: కేవలం నెలకు రూ. 125 చెల్లించి 12 ఓటీటీ సేవలను ఇలా పొందండి..! చదవండి: తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి.. -
Paytm: ఎల్పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 61 రూపాలయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తే.. ఏంటి జోక్ అనుకుంటున్నారా. కాదు వాస్తవమే. 861 రూపాయల విలువ చేసే గ్యాస్ సిలిండర్ కేవలం 61 రూపాలకే లభించనుంది. గ్యాస్ సిలిండర్‌పై ఆఫర్ పొందటానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆఫర్ పొందొచ్చు. ఈవాలెట్ సంస్థ పేటీఎం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. పేటీఎం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం మన దగ్గర గ్యాస్ సిలిండర్ ధర 861 రూపాయలుగా ఉంది. అంటే క్యాష్‌బ్యాక్ రూ.800 తీసేస్తే.. కేవలం 61 రూపాయలకే సిలిండర్ వచ్చినట్లు అవుతుంది. ఇక ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందాలని భావించే వారు పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారై ఉండాలి. వీరికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఆఫర్లో ఒక మెలిక ఉంది. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే రూ.10 నుంచి రూ.800 వరకు మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ రూ.800 వస్తుందని చెప్పడానికి లేదు. రూ.10 కూడా రావొచ్చని గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఇందులో మీకు ఎంత క్యాష్‌బ్యాక్ వచ్చింది అనేది ఉంటుంది. పేటీఎం ద్వారా ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేయడానికి చర్యలు 1. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 2. దీని తరువాత, మీ గ్యాస్ ఏజెన్సీతో సిలిండర్ బుకింగ్ చేయవలసి ఉంటుంది. 3. దీని కోసం, పేటీఎం యాప్‌లో Moreకి వెళ్లి, ఆపై రీఛార్జ్, పే బిల్లులపై క్లిక్ చేయండి. 4. దీని తరువాత, మీరు సిలిండర్ బుక్ చేసే ఆప్షన్ వస్తుంది. 5. ఇక్కడ, మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. 6. బుకింగ్ చేయడానికి ముందు, మీరు FIRSTLPG ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాలి. బుకింగ్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాలి. క్యాష్‌బ్యాక్ డబ్బులు పేటీఎం వాలెట్‌కు 48 గంటల్లోగా వచ్చి చేరతాయి. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ -
వంట గ్యాస్‌పై 50 పెంపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగని పెట్రో మంట న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్‌లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది. -
మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్
న్యూఢిల్లీ: కేవలం ఫోన్ మిస్డ్ కాల్తోనే ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్ఎస్ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. (చదవండి: కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?) -
సబ్సిడీలేని సిలిండర్లపై మళ్లీ బాదుడు
ముంబై, సాక్షి: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ వర్తించని 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు తాజాగా రూ. 50 చొప్పున ఎగశాయి. దీంతో ఢిల్లీలో వీటి ధరలు ప్రస్తుతం రూ. 644ను తాకాయి. ఇక కోల్‌కతాలో అయితే రూ. 670.5కు చేరాయి. ఈ ధరలు ముంబైలో రూ. 644కాగా.. చెన్నైలో రూ. 660గా నమోదయ్యాయి. సుమారు రెండు వారాల క్రితం సైతం సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 50 చొప్పున పెరిగిన విషయం విదితమే. సాధారణంగా విదేశాలలో ధరలు, రూపాయి మారకం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను నెలకోసారి సమీక్షిస్తుంటాయి. కాగా.. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందించే సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం.. ఇతర సిలిండర్లకూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతర వంట గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్లపైనా పెంపును ప్రకటించాయి. 5 కేజీల సిలిండర్‌పై తాజాగా రూ. 18 వడ్డించగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పైనా రూ. 36.5 పెంపును చేపట్టాయి. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్‌పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది. వెరసి ప్రస్తుతం వీటి ధరలు రూ. 1,296కు చేరాయి. -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంట గ్యాస్ భారం కూడా పెరగనుంది. తాజాపెంపుతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 భారం పడనుంది. కొత్త ధరలు ఈ రోజు (డిసెంబర్,2)నుండి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5చేరినట్టు తెలుస్తోంది. అలాగే తాజా నివేదికల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్ రూ.644కు పెరిగింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఐఓసీ వెబ్సైట్లో ఇచ్చిన ధర ప్రకారం ఢిల్లీలో ధరలు వంట గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 594 రూపాయలుగా ఉండగా ముంబైలో సిలిండర్ ధర రూ .594. చెన్నైలో 610 రూపాయలు, కోల్‌కతాలో రూ. 620 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర పెరిగింది. చెన్నైలో అత్యధికంగా సిలిండర్‌కు 56 రూపాయల చొప్పున భారం పడగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలలో 55 రూపాయలు పెరిగింది. -
సబ్సిడీయేతర ఎల్పీజీ ధర భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,285 నుంచి రూ.1029.50కు తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ చమురు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తారీఖున వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సబ్సిడీని వదులుకున్న గ్యాస్ వినియోగదారుల గ్యాస్ ధర గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అలాగే గృహ వినియోగదారుల 12 కోటా పరిధి దాటిన వారు సైతం సబ్సిడీయేతర గ్యాస్ ధరల్లోనే గ్యాస్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
పచ్చని కుటుంబంలో చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్ సిలిండర్ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా, మదిర గ్రామానికి చెందిన షేక్ సుభానీ(32), షేక్ షర్మిళ (25) దంపతులు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి సూరారం హనుమాన్ నగర్లో నివాసముంటున్నారు. వీరికి షేక్ హైదర్ ఫిర్దోస్(3) కుమార్తె. ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో సుభానీ సిలిండర్ మార్చాడు. 6వ తేదీ ఉదయం అతను సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుభానీతో పాటు అతడి భార్య షర్మిళ, కుమార్తె ఫిర్దౌస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 12న సుభాని, షర్మిళ మృతి చెందగా, చిన్నారి ఫిర్దోస్ బుధవారం కన్నుమూసింది. -
ఫ్యాక్టరీలో ఎల్పీజీ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
-
15 రోజుల్లోపే మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ప్రతీ నెల పెరిగే వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో కేవలం 9 రోజుల్లోనే రెండవసారి పెరిగింది. ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరాదారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ. 507.42కు చేరింది. డీలర్ల కమిషన్ ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లకు 14.2కేజీల సిలిండర్‌కు రూ.48.89, 5కేజీల సిలిండర్‌కు రూ. 24.20 చొప్పున కమిషన్ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14.2కేజీల సిలిండర్‌కు రూ. 50.58, 5 కేజీల సిలిండర్‌కు రూ. 25.29 చొప్పున కమిషన్ ఇవ్వాలి. 14.2 కిలోల సిలిండర్‌కు 20.50 డెలివరీ ఛార్జ్ ఉంటుంది. అయితే పంపిణీదారుల ప్రాంగణంనుంచి సిలిండర్‌ను నేరుగా తీసుకుంటే డెలివరీ ఛార్జినుంచి మినహాయింపు వుంటుందని ఇంధన సరఫరాదారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబరు 1వ తేదీనే రాయితీ గ్యాస్ సిలిండర్‌పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతినెలా వంటగ్యాస్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది. -
పెళ్లి వేడుకలో విషాదం.. 9మంది మృతి
-
ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు
న్యూఢిల్లీ: 2018 మార్చికల్లా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేయాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల రాయితీ సిలిండర్‌పై రూ.1.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం తెలిపింది. విమానాల్లో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరల్ని కిలోలీటర్‌కు రూ.3,025 (దాదాపు 6%) పెంచుతున్నట్లు పేర్కొంది. సబ్సిడీయేతర సిలిండర్‌పైనా రూ.1.50 పెంచుతున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో మార్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐవోసీ స్పష్టం చేసింది. గత ఆగస్టు 1న సిలిండర్‌పై రూ.2.30 పెంచిన కంపెనీలు సెప్టెంబర్‌లో ఏకంగా రూ.7 పెంచాయి. 2016 జూన్‌లో ఢిల్లీలో రూ.419.18గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.69.50 పెరిగి ప్రస్తుతం రూ.488.68కి చేరుకుంది. ప్రతినెలా 1న గత మాసంలో నమోదైన సగటు చమురు ధర, విదేశీమారక ద్రవ్య రేటు ఆధారంగా ఎల్పీజీ, ఏటీఎఫ్ ధరలను కంపెనీలు సవరిస్తున్నాయి. -
రూ.2 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర
న్యూఢిల్లీ: సబ్సిడీపై అందిస్తున్న ఎల్పీజీ సిలిండర్ ధర మంగళవారం రెండు రూపాయలకు పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసేలా ప్రతినెలా ఎల్పీజీ ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.477.46 నుంచి రూ.479.77కి పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. మరోవైపు ఢిల్లీలో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.564 నుంచి రూ.524కు తగ్గింది. -
నాన్ సబ్సిడీ సిలిండర్ ధర పెంపు..
ఢిల్లీ: నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. నాన్ సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ పై రూ.86 లను పెంచుతున్నట్టు బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే సబ్సిడీ సిలిండర్ల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మార్చి 1, 2017 నాటికి సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 737 గా ఉంటుందని, సబ్సిడీ రూ. 303 ఆయా ఖాతాల్లో జమ అవుతుందని వివరించింది. యథావిధిగా 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.434 ఉంటుందిని స్పష్టం చేసింది. మరోవైపు ఈ పెంపుప్రకటనతో ఐఓసీ కంపెనీ షేర్లు దాదాపు 1.2 శాతం పడిపోయింది