అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కుషాయిగూడ: గ్యాస్ లీక్ అవుతుందనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో నివాసముంటున్న దేవేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఇది గుర్తించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు.
తక్షణమే స్పందించిన అధికారులు గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి గ్యాస్ లీకేజీని ఆపేశారు. అప్పటికే సిలిండర్ బాగా వేడెక్కిందని.. మరి కొంతసేపు అలాగే ఉంటే సిలిండర్ పేలి పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.