శుభవార్త.. మళ్ళీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు | Commercial LPG Cylinder Rates Slashed By Rs 7 Ahead Of Union Budget 2025, Check New Rates Inside | Sakshi
Sakshi News home page

Cylinder Prices Reduced: శుభవార్త.. మళ్ళీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

Published Sat, Feb 1 2025 8:26 AM | Last Updated on Sat, Feb 1 2025 10:25 AM

Commercial LPG Cylinder Rates Slashed by Rs 7 Ahead of Union Budget 2025

నిర్మలా సీతారామన్ 'కేంద్ర బడ్జెట్ 2025-26' ప్రవేశపెట్టడానికి ముందే.. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను తగ్గించాయి. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల రేటు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. తగ్గిన ధరలు లేదా కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.

కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 7 తగ్గింది. దీంతో ఢిల్లీలో రూ. 1,804 వద్ద ఉన్న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,797కి చేరింది. జనవరి 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.14.5 తగ్గి రూ.1,818.5 నుంచి రూ.1,804కి చేరింది.

కోల్‌కతాలో ఈ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,911 నుంచి రూ.1,907కి తగ్గింది. ముంబైలో రూ. 1,756 నుంచి రూ. 1,749.50కి అందుబాటులో ఉంది. చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,959.50గా ఉంది.

వంట గ్యాస్ సిలిండర్ల ధరలు
గృహాల్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఢిల్లీలో 14 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ పాత ధరకే.. అంటే రూ.803 వద్ద అందుబాటులో ఉంది. లక్నోలో ఈ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.840.50 కాగా.. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.802.50. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ.818.50. కోల్‌కతాలో రూ.829గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement