నారీశక్తికి లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర వెంటనే అమల్లోకి వచి్చందని ప్రభుత్వం పేర్కొంది. ధర తగ్గింపుతో ఢిల్లీలో 14.2 కేజీల గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803కు దిగి వచి్చంది. స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలను బట్టి రాష్ట్రాల్లో ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
దేశీయ ఇంధన ధరలకు ప్రామాణికంగా భావించే అంతర్జాతీయ చమురు, గ్యాస్ ధరలు స్వల్పంగా కిందకు దిగొచి్చన కారణంగానే ఎల్పీజీ ధర తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రికార్డుస్థాయిలో గత 23 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎలీ్పజీపై రూ.100 తగ్గించింది.
దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు ముఖ్యంగా నారీశక్తికి ఈ నిర్ణయం లబ్ధి చేకూరుతుంది’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. గత ఆరునెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర తగ్గించడం ఇది రెండోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్‌లో సిలిండర్‌పై రూ.200 ధర తగ్గించారు. దీంతో అప్పటిదాకా తొమ్మిది నెలలుగా గరిష్టస్థాయి వద్ద ఉన్న సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగివచి్చంది. శుక్రవారం నాటి తగ్గింపుతో వినియోగదారులకు ఇంకాస్త ఉపశమనం లభించింది.
ఉజ్వల లబ్ధిదారులకు రూ.503కే : దేశవ్యాప్తంగా అందరూ సబ్సిడీయేతర ధరకే వంటగ్యాస్‌ను కొనుగోలుచేస్తున్నారు. అయితే ‘‘ ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన గ్రామీణ ప్రాంత పేదలకు మాత్రమే ఒక్కో సిలిండర్‌పై రాయితీ రూ.300 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. తాజా తగ్గింపుతో వారు రూ.503కే సిలిండర్ పొందొచ్చు’’ అని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టంచేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారాయి. 2021 జూలై– 2023 ఆగస్ట్ మధ్య సిలిండర్ ధర ఏకంగా రూ.294 పెరిగింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు 33 కోట్లకుపైగా ఉన్నారు. ఉజ్వల పథకం లబి్ధదారులు దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. ధర తగ్గింపుతో దేశంలోని రిటైల్ చమురు రంగ సంస్థలకు రూ.వేల కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment