cylinder price cut
-
సిలిండర్ ధర రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర వెంటనే అమల్లోకి వచి్చందని ప్రభుత్వం పేర్కొంది. ధర తగ్గింపుతో ఢిల్లీలో 14.2 కేజీల గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803కు దిగి వచి్చంది. స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలను బట్టి రాష్ట్రాల్లో ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. దేశీయ ఇంధన ధరలకు ప్రామాణికంగా భావించే అంతర్జాతీయ చమురు, గ్యాస్ ధరలు స్వల్పంగా కిందకు దిగొచి్చన కారణంగానే ఎల్పీజీ ధర తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రికార్డుస్థాయిలో గత 23 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎలీ్పజీపై రూ.100 తగ్గించింది. దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు ముఖ్యంగా నారీశక్తికి ఈ నిర్ణయం లబ్ధి చేకూరుతుంది’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. గత ఆరునెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర తగ్గించడం ఇది రెండోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్‌లో సిలిండర్‌పై రూ.200 ధర తగ్గించారు. దీంతో అప్పటిదాకా తొమ్మిది నెలలుగా గరిష్టస్థాయి వద్ద ఉన్న సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగివచి్చంది. శుక్రవారం నాటి తగ్గింపుతో వినియోగదారులకు ఇంకాస్త ఉపశమనం లభించింది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.503కే : దేశవ్యాప్తంగా అందరూ సబ్సిడీయేతర ధరకే వంటగ్యాస్‌ను కొనుగోలుచేస్తున్నారు. అయితే ‘‘ ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన గ్రామీణ ప్రాంత పేదలకు మాత్రమే ఒక్కో సిలిండర్‌పై రాయితీ రూ.300 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. తాజా తగ్గింపుతో వారు రూ.503కే సిలిండర్ పొందొచ్చు’’ అని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టంచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారాయి. 2021 జూలై– 2023 ఆగస్ట్ మధ్య సిలిండర్ ధర ఏకంగా రూ.294 పెరిగింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు 33 కోట్లకుపైగా ఉన్నారు. ఉజ్వల పథకం లబి్ధదారులు దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. ధర తగ్గింపుతో దేశంలోని రిటైల్ చమురు రంగ సంస్థలకు రూ.వేల కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా. -
కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
సాక్షి, పంజగుట్ట: వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్లపై ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే రాయితీని దేశ వ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేశారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్పీజీ డి్రస్టిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా నెలకు 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్ లభించేదని దాన్ని పూర్తిగా ఎత్తేశారని తెలిపారు. ఎల్పీజీ ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే సేఫ్టీ ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ శ్రీచరణ్, అశోక్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
సబ్సిడీయేతర ఎల్పీజీ సిలెండర్‌కు 103 రూపాయల తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలెండర్ ధర బాగా తగ్గింది. ఈ సిలెండర్‌కు ప్రభుత్వం 103 రూపాయలు తగ్గించింది. ఇక నుంచి నాన్ సబ్సిడీ సిలెండర్ ధర 605 రూపాయలు మాత్రమే ఉంటుంది. సబ్సిడీ సిలెండర్లు ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 మాత్రమే ఇస్తారు. ఆ తరువాత ఇంకా కావలసి వస్తే సబ్సిడీయేతర సిలెండర్లను మాత్రమే కొనుగోలు చేయాలి. జెట్ ఇంధనం ధర కూడా 11.3 శాతం తగ్గింది. తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పడిపోవడంతో ఈ ధరలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు.