సబ్సిడీయేతర ఎల్పీజీ సిలెండర్కు 103 రూపాయల తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలెండర్ ధర బాగా తగ్గింది. ఈ సిలెండర్కు ప్రభుత్వం 103 రూపాయలు తగ్గించింది. ఇక నుంచి నాన్ సబ్సిడీ సిలెండర్ ధర 605 రూపాయలు మాత్రమే ఉంటుంది. సబ్సిడీ సిలెండర్లు ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 మాత్రమే ఇస్తారు. ఆ తరువాత ఇంకా కావలసి వస్తే సబ్సిడీయేతర సిలెండర్లను మాత్రమే కొనుగోలు చేయాలి. జెట్ ఇంధనం ధర కూడా 11.3 శాతం తగ్గింది.
తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పడిపోవడంతో ఈ ధరలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు.