మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్‌ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్‌ఎక్స్‌ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్‌పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్‌ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్‌షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.
తగ్గిన విక్రయాలు
ఈ ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.
ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్‌లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment