Maruti Suzuki Alto
-
మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్‌పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్‌షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.తగ్గిన విక్రయాలుఈ ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్‌లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి. -
నేటి నుంచి పెరిగిన కార్ల ధరలు.. ఎంతంటే..?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుందని సంస్థ పేర్కొంది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?
Maruti Alto: మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ప్రకటించింది. ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) దేశంలో మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సిఎన్‌జిలను విడుదల చేసింది. 2012 నాటికి 20 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లోఆల్టో 30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గత ఏడాది కంపెనీ మూడవ తరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్జీ పవర్ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) -
‘ఆల్టో’ ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ వాహనంగా అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు ధరలను పెంచింది. పలు భద్రతా ఫీచర్లను ఈ కారులో జోడించిన కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ కారు నూతన ధరల శ్రేణి రూ.3.65 లక్షలు నుంచి రూ.4.44 లక్షలకు చేరింది. తాజా పెంపు నిర్ణయంతో ఈ ప్రాంతంలో రూ.23,000 ధర పెరిగింది. ఇతర ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.3.75 లక్షల నుంచి రూ.4.54 లక్షలుగా ఉంది. ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్‌తో పాటు అతని పక్కన కూర్చున్న వ్యక్తికి సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది. -
జీఎస్టీ తర్వాత ఈ కార్ల ధరలు పైపైకే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుండటంతో, పాత ఇన్వెంటరీని విక్రయించుకోవడానికి దాదాపు అన్ని సంస్థలు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక వాహన రంగ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయానికి తీసుకొచ్చాయి. మెర్సిడెస్ నుంచి ఫోర్డ్ వరకు అన్ని సంస్థలు డిస్కౌంట్ల బాట పట్టాయి. కానీ జీఎస్టీ అమలు తర్వాత వాహనరంగ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏ కారు కొంటే ఎంత మేర జేబుకు చిల్లుపడుతుంది? ఏ కార్ల ధరలు తగ్గొచ్చూ అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ తర్వాత బడ్జెట్ కార్లు, మాస్-మార్కెట్ కొనుగోలు చేసే కార్ల ధరలు 3 శాతం నుంచి 5 శాతం పైకి ఎగుస్తాయని తెలుస్తోంది. అంటే కారు ధర రూ.5 లక్షలు ఉందనుకోండి.. ఈ కారు ధర జీఎస్టీ అమలు తర్వాత రూ.15వేల నుంచి రూ.25వేల మేర పెరుగుతుంది. మార్కెట్లో ఎక్కువగా పాపులర్ కారు అయిన మారుతీ సుజుకీ ఆల్టో ధర కూడా అత్యధికంగా పైకి ఎగుస్తుందట. ప్రస్తుత పన్ను రేటు దీనిపై 25-27.5శాతముంటే, అది కాస్త 29శాతం కంటే పైగా పెరుగుతోంది. దీంతో ఆల్టో ధరలు పెరుగనున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ డీలర్లు ఆల్టో, స్విఫ్ట్ లపై రూ.25వేల నుంచి రూ.35వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇతర కారు సంస్థలు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. హ్యుందాయ్ రూ.25వేల నుంచి రూ.2 లక్షల 50వేల వరకు ధర ప్రయోజనాలను అందింస్తుండగా.. డాట్సన్ సంస్థ ఉచిత ఇన్సూరెన్స్, తగ్గింపు వడ్డీరేట్లను అందిస్తోంది. ఒక్క మారుతీ ఆల్టో ధర మాత్రమే కాక, రెనాల్డ్ క్విడ్ ధర కూడా దాదాపు రూ.7,500 వరకు పెరుగనుంది. ప్రస్తుతం రెనాల్డ్ క్విడ్ ధర రూ.3,32,312(ఎక్స్ షోరూం-ఢిల్లీ) ఉంది. దీని పన్ను రేటు జీఎస్టీతో 26శాతం నుంచి 29శాతానికి పెరుగుతోంది. ఈ పన్ను పెరగడమే కారు ధర పైకి ఎగియడానికి దోహదం చేస్తోంది. హోండా సిటీ కారు కూడా రూ.10,735మేర పెరుగుతోంది. ప్రస్తుతం దీని ధర 10,12,797 రూపాయలుగా ఉంది. జీఎస్టీతో ఎక్కువగా డీజిల్ కార్లు ప్రభావం చెందుతాయని, వీటి ధరలు 21వేల రూపాయల వరకు పెరుగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ డిజైర్ ధర ఎక్స్ షోరూం-ఢిల్లీలో ప్రస్తుతం రూ.7,76,000 ఉంటే, అది కాస్త జీఎస్టీ తర్వాత 21వేల రూపాయలు పెరిగి, 7,97,300 రూపాయలకు చేరుకోనుంది. -
30 లక్షల మార్క్ కు మారుతీ ఆల్టో విక్రయాలు
న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కాంపాక్ట్ కారు ఆల్టో దేశీ విక్రయాలు 30 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. దేశంలో తొలిసారి ఈ మార్క్‌ను అందుకున్న బ్రాండ్‌గా ఆల్టో చరిత్ర సృష్టించింది. ఆల్టో మోడల్ ఈ మైలురాయిని అధిగమించడానికి 15 సంవత్సరాల 6 నెలల కాలం పట్టింది. అలాగే మారుతీ సుజుకీ 3.8 లక్షల యూనిట్ల ఆల్టో కార్లను విదేశాలకు ఎగుమతి చే సింది. కంపెనీ ఆల్టో మోడల్‌ను 2000 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చింది.