
30 లక్షల మార్క్ కు మారుతీ ఆల్టో విక్రయాలు
న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కాంపాక్ట్ కారు ఆల్టో దేశీ విక్రయాలు 30 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. దేశంలో తొలిసారి ఈ మార్క్‌ను అందుకున్న బ్రాండ్‌గా ఆల్టో చరిత్ర సృష్టించింది. ఆల్టో మోడల్ ఈ మైలురాయిని అధిగమించడానికి 15 సంవత్సరాల 6 నెలల కాలం పట్టింది. అలాగే మారుతీ సుజుకీ 3.8 లక్షల యూనిట్ల ఆల్టో కార్లను విదేశాలకు ఎగుమతి చే సింది. కంపెనీ ఆల్టో మోడల్‌ను 2000 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.