
ఎంజీ విండ్సర్ (MG Windsor) ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో అరుదైన ఘనత సాధించిందని జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. మార్కెట్లో లాంచ్ అయిన ఆరు నెలల్లో 20,000 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ నిలిచింది.
ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఎంజీ మోటార్ కార్లకంటే భిన్నంగా ఉన్న.. విండ్సర్ ఈవీ అతి వేంగంగా అమ్ముడైందని.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ సేల్స్ & మార్కెటింగ్ రాకేష్ సేన్ స్పష్టం చేశారు. మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్.. అధిక రేంజ్ వంటి కారణాల వల్ల దీనిని చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎంజీ విండ్సర్ 38 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌పై 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 136 హార్స్ పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎక్సైట్ (రూ. 13,99,800), ఎక్స్‌క్లూజివ్ (రూ. 14,99,800), ఎసెన్స్ (రూ. 15,99,800) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
ఎంజీ మోటార్ కంపెనీ.. భారతదేశంలో ప్రస్తుతం హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జెడ్ఎస్ఈవీ, కామెట్ వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కాగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సైబర్‌స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.