![MG Windsor Over 3000 Units Sold For 4 Months in India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/mg-windsor-ev-sales.jpg.webp?itok=kJz5z4yM)
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.
ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్‌లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment