భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు దాదాపు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంలో నిమగ్నమైపోయాయి. ఇప్పటికే దేశీయ విఫణిలో చాలా వాహనాలు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో భారత్ పరుగులు పెడుతోంది. 2023 ప్రారంభమైన కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 2.78 లక్షల ఈవీలు విక్రయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది దేశ చరిత్రలోనే ఎప్పుడూ అమ్ముడుకానన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2022లో మార్కెట్లో మొత్తం ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ప్రతి నెలలోనూ 90వేలకు తగ్గకుండా అమ్ముడయ్యాయని నితిన్ గడ్కరీ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర రోడ్డు, రవాణాశాఖ ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించి ఈ డేటాను రూపొందించినట్లు ఈ సందర్భంగా వివరించారు.
వాహన్ పోర్టల్ ప్రకారం మన దేశంలో 2021లో 3.29లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు జరుగగా, 2022లో ఆ సంఖ్య 10.20 లక్షలకు చేరింది. 2021 కంటే 2022లో ఈవీల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని స్పష్టమవుతోంది. ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్ జాబితా లేదు. ఇవన్నీ త్వరలోనే జాబితాలో చేరనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఈ ఏడాది మార్చి 15 నాటికి దేశంలో 21.70 లక్షల ఈవీ విక్రయాలు జరిగాయి. ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోన్ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (4.65 లక్షలు) మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (2.26లక్షలు), ఢిల్లీ (2.03లక్షలు) ఉన్నాయి. ఫోర్ వీలర్ విభాగంలో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. టూ వీలర్ సెగ్మెంట్లో హీరో, ఓలా కంపెనీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment