
2027 నాటికి ఢిల్లీలో తిరిగే వాహనాలలో 95 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని, దీనికోసం ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0 ప్రారంభించింది. ఈ పాలసీ కింద దశల వారీగా ఫ్యూయెల్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తామని రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ నగరం.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీనిని నివారించాలంటే.. ఫ్యూయెల్ వాహన స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలి. ఇందులో భాగంగానే.. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, చిన్న కమర్షియల్ వాహనాలను మాత్రమే కాకుండా CNGతో నడిచే వాహనాల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రజా రవాణా కోసం కూడా ఎలక్ట్రిక్ బస్సులనే ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీ ఈవీ పాలసీ 2.0ను ప్రోత్సహించడానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రక్కులు మొదలైనవాటికి వరిస్తాయి. స్క్రాపేజ్ కింద కూడా కొన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే.. కొత్త వెహికల్ కొనుగోలుపై కొన్ని రాయితీలు లభిస్తాయి.
ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలంటే.. మౌలిక సదుపాయాలను పెంచాలి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లను పెంచనుంది. కొత్త భవనాలు, బహిరంగ ప్రదేశాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం మీద 2027 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 'ఈవీ పాలసీ 2.0' ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment