Delhi Govt Launching New Aggregator Policy For Electric Vehicle Push - Sakshi
Sakshi News home page

రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌కు నో ఎంట్రీ.. ఎక్కడంటే?

Published Sat, Apr 8 2023 2:32 PM | Last Updated on Sat, Apr 8 2023 2:45 PM

Delhi Govt Launching New Aggregator Policy For Electric Vehicle Push - Sakshi

దేశ రాజధానిలో ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 నాటికి ఢిల్లీలో ట్యాక్సీ, ఫుడ్‌ డెలివరీ కంపెనీలు తప్పని సరిగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వినియోగించాలని తెలిపింది. పెట్రోల్‌,డీజిల్‌ వాహనాల వినియోగాన్ని నిలిపివేస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా వెహికల్‌ పాలసీని అమలు చేస్తున్నట్లు సూచించింది. 

ఈ సందర్భంగా ట్రాన్స్‌ పోర్ట్‌ మినిస్టర్‌ కైలాష్‌ గెహ్లట్‌ మాట్లాడుతూ..ఢిల్లీలో క్యాబ్‌, ఈకామర్స్‌ కంపెనీలు ఏప్రిల్‌ 1,2030 నాటికల్లా ఎలక్ట్రిక్‌ వాహనాల్ని వినియోగించాలి. ఇందకోసం వెహికల్స్‌ పాలసీ అమలు చేస్తున్నాం. ఈ పాలసినీ ట్రాన్స్‌పోర్ట్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఆమోదించాల్సి ఉంది. అనంతరం కొత్త వెహికల్‌ రూల్‌ను అమలు చేస్తామని అన్నారు. 

కొత్త పాలసీలో అగ్రిగేటర్లు ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్స్‌లను మాత్రమే నడిపేందుకు అనుమతిస్తారు. తద్వారా రవాణాన్ని రంగాన్ని మరింత ఊతం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. అందుబాటు ధరల్లో నగరం అంతటా ప్రభుత్వం మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. 

ఈ విధానం అమలు కోసం దశలవారీ ప్రణాళికను రూపొందించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఉదాహరణకు, నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోపు అగ్రిగేటర్‌లు 5 శాతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉండాలి. తొమ్మిది నెలల్లో 15 శాతానికి, ఒక సంవత్సరం ముగిసే నాటికి 25 శాతానికి, రెండేళ్లు ముగిసే నాటికి 50 శాతానికి, మూడేళ్లు ముగిసే నాటికి 75 శాతానికి, నాలుగు చివరి నాటికి 100 శాతానికి పెంచనున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, ఏప్రిల్ 1, 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం వాణిజ్య వాహనాలు ఈవీలుగా మారనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement