disel
-
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్‌కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. -
2027 నాటికీ డీజిల్ వాహనాలు నిషేధం
-
రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ.. ఎక్కడంటే?
దేశ రాజధానిలో ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 నాటికి ఢిల్లీలో ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ కంపెనీలు తప్పని సరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగించాలని తెలిపింది. పెట్రోల్,డీజిల్ వాహనాల వినియోగాన్ని నిలిపివేస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా వెహికల్ పాలసీని అమలు చేస్తున్నట్లు సూచించింది. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కైలాష్ గెహ్లట్ మాట్లాడుతూ..ఢిల్లీలో క్యాబ్, ఈకామర్స్ కంపెనీలు ఏప్రిల్ 1,2030 నాటికల్లా ఎలక్ట్రిక్ వాహనాల్ని వినియోగించాలి. ఇందకోసం వెహికల్స్ పాలసీ అమలు చేస్తున్నాం. ఈ పాలసినీ ట్రాన్స్పోర్ట్, లెఫ్టినెంట్ గవర్నర్లు ఆమోదించాల్సి ఉంది. అనంతరం కొత్త వెహికల్ రూల్‌ను అమలు చేస్తామని అన్నారు. కొత్త పాలసీలో అగ్రిగేటర్లు ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్స్‌లను మాత్రమే నడిపేందుకు అనుమతిస్తారు. తద్వారా రవాణాన్ని రంగాన్ని మరింత ఊతం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. అందుబాటు ధరల్లో నగరం అంతటా ప్రభుత్వం మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం అమలు కోసం దశలవారీ ప్రణాళికను రూపొందించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఉదాహరణకు, నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోపు అగ్రిగేటర్లు 5 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. తొమ్మిది నెలల్లో 15 శాతానికి, ఒక సంవత్సరం ముగిసే నాటికి 25 శాతానికి, రెండేళ్లు ముగిసే నాటికి 50 శాతానికి, మూడేళ్లు ముగిసే నాటికి 75 శాతానికి, నాలుగు చివరి నాటికి 100 శాతానికి పెంచనున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, ఏప్రిల్ 1, 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం వాణిజ్య వాహనాలు ఈవీలుగా మారనున్నాయి. -
దటీజ్ రతన్ టాటా... ఆయన పోన్ కాల్ కంపెనీ స్థితినే మార్చింది
రెపోస్ ఎనర్జీ అనేది స్టార్టప్ కంపెనీ. ఇది యాప్ ద్వారా డీజిల్‌ని ఇంటికి డెలివరీ చేస్తుంది. టాటా మోటర్స్ నుంచి సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అందుకున్న కంపెనీ కూడా. ఐతే రతన్ టాటా నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్ తమ కంపెనీ స్థితిని ఏవిధంగా మారిందో రెపోస్ ఎనర్జీ సహా వ్యవస్థాపకురాలు అదితి భోసలే వాలుంజ్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు అదితి భోసలే వాలుంజ్ మాట్లాడుతూ....కొన్నేళ్ల క్రితం తాను తన భర్త చేతన్ వాలుంజ్ రెపోస్ ఎనర్జీని ప్రారంభించాలనుకున్నారు. తమ సంస్థ బాగా ఎదగాలంటే మంచి మార్గనిర్దేశం చేసే వ్యక్తి అవసరమని అనుకున్నారు. వారిద్దరు రోల్‌మోడల్‌గా తీసుకునేది రతన్ టాటానే. అందుకని ఆయన్నే కలుద్దాం అని అదితి తన భర్తతో అంది. ఐతే ఆయన ఏమి మన పక్కంటి వ్యక్తి కాదు సులభంగా కలవడానికి అని ఆమె భర్త వ్యగ్యంగా అన్నారు. అంతేగాక చాలామంది కూడా అసాధ్యం అని నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ అదితి తన పట్టువదల్లేదు. ఎలాగైన కలవాలనుకుంది. అందుకోసం తన రెపోస్ కంపెనీ ఉద్దేశాన్ని వివరిస్తూ...త్రిడీ ప్రెజెంటేషన్ సిద్దం చేసింది. అంతేగాక రతన్ టాటా ఇంటి బయట భార్యభర్తలిద్దరూ పడిగాపులు కాయడమే గాక రాతపూర్వకంగా ఒక లేఖను కూడా రతన్ టాటాకు అందేలా కొందరి సాయం తీసుకుంది. అయినా ప్రయోజనం ఏమి లేకపోయింది. చివరికి రతన్ టాటి ఇంటి వద్ద చాలా సేపు వెయిట్ చేసి ఇక నిరాశగా హెటల్‌కి వెళ్తుండగా సుమారు రాత్రి 10 గం.ల సమయంలో రతన్ టాటా నుంచి వారికి ఫోన్ వచ్చింది. ఇక వారి ఆనందానికి అవధులే లేవు. అంతేకాదు రతన్ టాటా ఫోన్లో 'హయ్ నేను రతన్ టాటా' అదితితో మాట్లాడవచ్చా! అని అడిగారు. ఐతే అదితికి నమ్మశక్యంగా అనిపించకపోవడంతో ఎవరూ మీరంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం అవగతమైంది. మరుసటి రోజే రతన్‌ని కలిసి తన కంపెనీ గురించి వివరించింది. ఐతే టాటా తన నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగారు. తమకు దేశానికి సేవ చేయడంలో సాయం చేయడమే గాక వ్యాపారంలో మార్గనిర్దేశం చేయమని అడిగాం అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు అదితి భోసలే. ఆ రోజు తర్వాత నుంచి తమ కంపెనీ దిశ మారిపోయిందని అన్నారు. (చదవండి: శ్రీలంకలా మారిని బంగ్లాదేశ్... భగ్గుమంటున్న నిరసన సెగలు) -
అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!
కెనడా: గ్రీన్‌ల్యాండ్‌కి సరిహద్దుగా ఉన్న కెనడాకి ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్‌లో భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ల్యాబ్ అధికారులు ఆ నగరంలోని వాటర్ ట్యాంక్ నుంచి సేకరించిన తాగు నీటిలో ఇంధన ఆయిల్లు అధిక స్థాయలో ఉన్నట్లు నిర్థారించారు. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) ఈ సందర్భంగా ఇకాలుయిట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ అమీ ఎల్గర్స్మా మాట్లాడుతూ...."భూగర్భ జల కాలుష్యం కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధన వాసన వస్తుండవచ్చు. బహుశా ఆ వాసన డీజిల్ లేదా కిరోసిన్‌కి సంబంధించిన వాసన కావచ్చు. సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నీటిని ప్రజలు ఉపయోగించవద్దు. నీటిని కాచినప్పటికీ ఆ వాసన పోదని పైగా మీరు మీ ట్యాంకులోని నీటిని ఎప్పటి నుంచి వినయోగించుకోవచ్చో కూడా మేమే తెలియజేస్తాం" అని అన్నారు. ఈ మేరకు ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటూ నునావుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ ప్యాటర్సన్ ప్రజలను హెచ్చరించారు. తాగు నీటి సమస్య ఒక తీరని సమస్యగా ఉందంటూ..కెనడా లిబర్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 2015లో అన్ని మరుగు నీటి సమస్యలను పరిష్కిరిస్తానన్న హామీతోనే జస్టిన్ ప్రధానిగా ఎన్నికవ్వడం గమనార్హం. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
డీజిల్ కార్లకు మారుతీ మంగళం!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ నుంచి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి. కేవలం డీజిల్ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్ నుంచి కంపెనీ ఎల్సీవీ సూపర్ క్యారీ డీజిల్ వెర్షన్ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్1 నుంచి మేము డీజిల్ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. అయితే బీఎస్6 డీజిల్ కార్లకు డి మాండ్ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మో డల్ను తయారు చేస్తామని వివరించారు. భవిష్యత్‌లో డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను తయారు చే యాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్ ఇం జన్లనే తయారు చేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు. బీఎస్6 నిబంధనలతో మరింత ప్రియం యూరప్‌లో బీఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాహనాల విక్రయాల్లో క్షీణత నమోదవుతోందని భార్గవ చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన డీజిల్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీంతో వీటిపై కస్టమర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో కస్టమర్లు ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, అందువల్ల ఇకపై డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలు ఇక్కడ కూడా క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ఏడాది కొనడం మంచిదని, వచ్చే ఏడాది వీటి ధరలు భారీగా పెరగవచ్చని సూచించారు. ఇటీవలే కంపెనీ బీఎస్4 నిబంధనలకు అనుగుణమైన సియాజ్ సెడాన్ 1,500 లీటర్ల డీజిల్ ఇంజన్ వెర్షన్‌ను తయారు చేసింది. ఈ కారు ఇంజన్‌ను కంపెనీ సొంతంగా నిర్మించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే డీజిల్ వాహనాల్లో ఇంజన్లను ఫియట్ సరఫరా చేస్తోంది. 2020 మార్చి చివరకు తమ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే 16 మోడళ్ల పెట్రోల్ ఇంజన్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఆల్టో 800ను బీఎస్6 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బలమైన హైబ్రిడ్ సాంకేతికతో తయారు చేసిన మోడళ్లను తీసుకువచ్చే ఆలోచన లేదని, భవిష్యత్‌లో వీటిపై ఫోకస్ చేస్తామని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు. లాభంలో 4.6 శాతం క్షీణత మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికరలాభం 4.6 శాతం పతనమై 1,795.6 కోట్లకు చేరింది. 2017–18 చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 1882.1 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 20,737.5 కోట్లకు చేరాయి. అంతకుముందేడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా అధికం. క్యు4లో మొత్తం కార్ల విక్రయాలు స్వల్పంగా క్షీణించి 4,58,479 యూనిట్లకు చేరాయి. మొత్తం 2018–19 సంవత్సరానికి కంపెనీ నికరలాభం 2.9 శాతం పతనమై 7,500.6 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 6.3 శాతం పెరిగి 83,026.5 కోట్లకు చేరాయి. వాల్యూం పరంగా విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449 యూనిట్లకు చేరాయి. ఇందులో 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో కరెన్సీ రేట్లలో ఆటుపోట్లు, కమోడిటీ ధరల్లో పెరుగుదల, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, రూపీ క్షీణత వంటివి ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ వివరించింది. తాము చేపట్టిన వ్యయ నియంత్రణా చర్యలు లాభాలు మరింత పతనం కాకుండా ఆదుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ షేరుపై రూ. 80 డివిడెండ్‌ను మారుతీ ప్రకటించింది. గతేడాది రూ.4వేల కోట్ల మూలధన వ్యయాలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,500 కోట్ల క్యాపెక్స్ ప్రణాళికలు తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఈ నిధులను ఆర్అండ్డీ, కొత్త షోరూంలకోసం భూసమీకరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై వెచ్చిస్తామని కంపెనీ సీఎఫ్ఓ అజిత్ సేథ్ చెప్పారు. కంపెనీ ఉత్పాదిత బాలెనో ధరను రూ. 15వేల మేర పెంచుతున్నట్లు మారుతీ ప్రకటించింది. ఆర్సీ భార్గవ -
పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలు
న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం సోమవారం లీటరు పెట్రోల్‌పై 15 పైసలు ధర తగ్గింది. అదేవిధంగా లీటరు డీజిల్ ధరపై కూడా 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. కర్ణాటక ఎన్నికల అనంతరం నుంచి వరుసగా 16 రోజుల పాటు వాహనదారులకు వాత పెట్టిన చమురు సంస్థలు, ఆ అనంతరం మే 30 నుంచి తగ్గడం ప్రారంభించాయి. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 33 పైసలు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ధరల తగ్గింపు అమలవుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.82.59గా, డీజిల్ ధర రూ.74.97గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంకేతాలు కూడా ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయని. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే, పరిస్థితి పూర్తిగా మన అదుపులోకి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిందని చెప్పారు. రికార్డు స్థాయిలను చేధించిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కరాన్నే ఎంచుకునేలా ముందుకు సాగుతోంది. -
పెట్రో డీలర్ల సమ్మెబాట
► రెండ్రోజులపాటు పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేత ► దేశవ్యాప్త నిరసనలో భాగంగానే... ► డిమాండ్ల సాధనపై నేడు ముంబైలో చమురు పరిశ్రమతో చర్చలు ► చర్చలు విఫలమైతే రేపట్నుంచి ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకే విక్రయాలు ► 6వ తేదీ నుంచి సెలవు రోజుల్లో అమ్మకాలు బంద్ ► 15న పూర్తిస్థాయిలో బంద్ పాటింపు సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కమీషన్ పెంపు సహా ఇతర డిమాండ్ల సాధన కోసం పెట్రోలియం డీలర్లు సమ్మెబాట పట్టారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం చమురు పరిశ్రమ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగే చర్చలు విఫలమైతే 5వ తేదీ నుంచి కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడుపుతామని పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి ప్రతి ఆదివారంతోపాటు ప్రతి రెండో, నాలుగో శనివారాలు, బ్యాంకు, ప్రభుత్వ సెలవు దినాల్లో అమ్మకాలను నిలిపివేయనున్నారు. ఈ నెల 15న పూర్తిస్థాయిలో బంకుల బంద్ పాటించనున్నారు. డీలర్లు ఇప్పటికే గత నెల 19 , 26 తేదీల్లో సాయంత్రం 15 నిమిషాలపాటు అమ్మకాలు నిలిపి నిరసన తెలిపారు. కమీషన్ పెంచాల్సిందే పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రస్తుతం 3 శాతంగా ఉన్న కమీషన్‌ను 5 శాతానికి పెంచాలన్నదే డీలర్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది. డీలర్ల మార్జిన్‌పై 2011లో కేంద్ర ప్రభుత్వం నియమించిన అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమల్లో చమురు సంస్థలు పూర్తిగా విఫలయమయ్యాయయని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలకోసారి తమ కమీషన్ ను పెంచే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చిన చమురు సంస్థలు ఇప్పటికీ హామీని నెరవేర్చలేకపోయాయని విమర్శిస్తున్నారు. డీలర్లకు తెలియజేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే విధానానికి స్వస్తి పలకాలని, కొత్త పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనవసరంగా అనుమతులు ఇవ్వరాదని, 2012లో జారీ చేసిన మార్కెటింగ్ డిసిప్లిన్ గైడ్‌లైన్స్ (ఎండీజీ)ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాజధానిలో పెట్రో ఉత్పత్తులకు ఏర్పడనున్న కొరత... రాష్ట్రంలో మొత్తం 1,564 పెట్రోల్ బంకులు ఉండగా అందులో హైదరాబాద్ మహానగర పరిధిలో 460 బంకులు ఉన్నాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి నిత్యం హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. డీలర్ల రెండ్రోజుల నిరసన వల్ల శుక్రవారం సాయంత్రానికి సగానికిపైగా బంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి మాకు మార్జిన్లు తగ్గుతున్న కారణంగా నిరసన చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే రెండ్రోజులపాటు పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపేస్తున్నాం. స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుపుతాం. ఇందుకు వినియోగదారులు సహకరించాలి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమీషన్‌ను 5 శాతానికి పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా ఒకే ధరల విధానం అమలు, ధరల హెచ్చుతగ్గుల వల్ల సంభవించే నష్టం రీయింబర్స్మెంట్, కొత్త అవుట్లెట్ల ఏర్పాటు వల్ల వాటి సమీప బంకులపై ప్రభావం లేకుండా చర్యలు, బంకుల్లో వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను చమురు సంస్థల ద్వారా థర్డ్ పార్టీకి అప్పగించడం వంటి డిమాండ్లను చమురు సంస్థలు చేపట్టాలి. – జి. వినయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
బయో డీజిల్ సరఫరా ప్రారంభం
హెచ్‌పీసీఎల్ టెర్మినల్ వద్ద ప్రారంభించిన సబ్ కలెక్టర్ గోకవరం : గోకవరంలోని హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో బయో డీజిల్ సప్లయి స్టేషన్ ప్రారంభమైంది. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ లాంఛనంగాప్రారంభించారు. తొలుత ప్లాంట్ సీనియర్ మేనేజర్ దామోదరన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్లాంట్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్, డ్రైవర్, వర్కర్, సెక్యూరిటీ తదితర విభాగాల వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మరణించిన హెల్పర్ వీరబాబు కుటుంబానికి ఉద్యోగుల తరఫున రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా బయో డీజిల్ సప్లయి స్టేషన్‌ను హెచ్పీసీఎల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం రాజమహేంద్రవరం, కాకినాడలోని సుమారు 12 బంకులకు బయో డీజిల్ సరఫరా చేస్తారని తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించారు. బయోడీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం ఉండదన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
-
తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం చొప్పున వ్యాట్ పెంచారు. దీంతో పెట్రోల్‌పై 35 నుంచి 40కి, డీజిల్‌పై 27 నుంచి 32 శాతం వరకు వ్యాట్ పెరిగింది. -
బంక్‌లు బంద్
జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగా రు. ఫలితంగా జిల్లాలోని 220 బంకులు నిరవధికంగా మూతపడ్డాయి. వీరి ఆందోళన ఫలితంగా లక్షలాది వాహనాల చోదకులకు అవస్థలు మొదలయ్యాయి. తూనికలు కొలతల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం బంకులపై దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్నవాటిని సీజ్ చేస్తుండటం, లక్షలాది రూపాయలు అపరాధరుసుం వసూలు చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. ఈ సందర్బంగా గుంటూరులోని లాడ్జిసెంటర్లోగల బంకు యజమానుల యూనియన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం యూనియన్ జిల్లా అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తూనికలు, కొలతల శాఖ అధికారుల మొండివైఖరివల్లే తాము సమ్మె చేపట్టామని వెల్లడించారు. పదేళ్లుగా ఆయిల్ కంపెనీలే బంకులకు పంపులను సరఫరా చేసేవారనీ, వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసిన తరువాతనే వినియోగించేవారమని తెలిపారు. కానీ అర్ధంతరంగా చమురు కంపెనీలు, పంపుల తయారీ కంపెనీలతో తలెత్తిన మనస్పర్థల కారణంగా బంకుల్లో వినియోగిస్తున్న పంపుల్లో తప్పులున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏటా అధికారులు తనిఖీలు నిర్వహించి, పంపులపై ముద్రలు వేస్తారని ఇప్పుడు ఆ విధానానికి స్వస్తిపలికి ఏకంగా అక్రమాలు జరిగాయం టూ లక్షలాది రూపాయలు జరిమానా విధించడం సరికాదని పేర్కొన్నారు. డ్రైస్వైన్ కంపెనీకి చెందిన పంపులు వినియోగించుకోవచ్చని గతంలో తూనికలు కొలతల శాఖ అమోదించిందనీ, ఇప్పుడు దానినీ అనుమానిస్తోందని చెప్పారు. ఒక పంపు ఏర్పాటు చేయాలంటే వ్యయం లక్షల్లో ఉంటుందని, ఏర్పాటు చేయటానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందన్నారు. పంపుల తయారీ కంపెనీలతో వివాదం వల్ల బంకులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 9లక్షల లీటర్ల పెట్రోలు, 27లక్షల లీటర్ల డీజిల్ వినియోగదారులకు అందిస్తున్నామనీ, బంకులు నిలుపుదల చేయటం వల్ల ప్రజల్లో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేసి రాతపూర్వకంగా పంపులు వినియోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసే వరకూ సమ్మెద్వారా నిరసన తెలుపుతామన్నారు. -
రైలు ఆగితే.. ఇక ఇంజినూ ఆగుతుంది!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధికంగా డీజిల్‌ను వినియోగిస్తున్న రైల్వేశాఖ.. ఆ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రైలు ఆగి ఉన్నప్పుడు ప్రధాన ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచాల్సిన అవసరం లేకుండా చేసే.. ‘యాక్సిలర్ పవర్ యూనిట్ (ఏపీయూ)’ను డీజిల్ లోకోమోటివ్ (ఇంజిన్)లలో ఏర్పాటు చేయనుంది. తొలుత ప్రయోగాత్మకంగా 12 ఇంజన్లలో ఏర్పాటు చేసి పరిశీలిస్తోంది. ఈ ఏపీయూ వల్ల ఒక్కో లోకోమోటివ్ ఏడాదికి రూ. 20 లక్షల విలువైన డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోగలుగుతుందని అంచనా.