ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్‌లలో చమురు చౌకగా మారింది.
ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది.
గ్లోబల్ మార్కెట్‌లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్‌కు 78.60 డాలర్లకు చేరింది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment