2022 నుంచి ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిన భారత్.. క్రమంగా వృద్ధి చెందుతూనే ఉంది. అగ్రశ్రేణి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు చూపు కూడా ఇండియా వైపు పడుతోంది. దీంతో చాలా సంస్థలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 అనేక కొత్త వాహనాలు దర్శనమివ్వనున్నాయి.
ఢిల్లీ వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభమైన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024' ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది. ఇందులో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్, అశోక్ లేలాండ్ వంటి సుమారు 28 కంపెనీలు, 600కి పైగా ఆటో కాంపోనెంట్ తయారీదారులు, 50కి పైగా బ్యాటరీ అండ్ స్టోరేజీ కంపెనీలు, 10 కంటే ఎక్కువ టైర్ల తయారీదారులు, తొమ్మిది నిర్మాణ పరికరాల తయారీదారులు, ఐదు స్టీల్ తయారీదారులు, 15 కంటే ఎక్కువ టెక్నాలజీ అండ్ స్టార్టప్ కంపెనీలు మొదలైనవి కనిపించనున్నాయి.
భారతదేశం వాహన తయారీదారులకు అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాణిజ్య వాహనాల వరకు భారతదేశం ప్రపంచంలోని నాలుగు పెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. ఉత్పత్తికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఇండియా చాలా అనుకూలంగా ఉంటుంది. 2030 నాటికి భారతదేశంలో ఉత్పత్తయ్యే అన్ని ప్యాసింజర్ వాహనాల్లో వాహనాల వాటా 14 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. అంతే కాకుండా భారతదేశంలో ఉత్పత్తయ్యే టూ వీలర్లలో దాదాపు 30 శాతం ఎగుమతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
Comments
Please login to add a commentAdd a comment