దేశవ్యాప్తంగా రిటైల్‌లో వాహన అమ్మకాలు జూలైలో 14,36,927 యూనిట్లు నమోదయ్యాయి.2021 జూలైతో పోలిస్తే ఇది 8 శాతం తగ్గుదల. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) ప్రకారం.. క్రితం ఏడాదితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లకు వచ్చి చేరాయి.
ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 10,09,574 యూనిట్లుగా ఉంది. ట్రాక్టర్ల అమ్మకాలు 28 శాతం పడిపోయి 59,573 యూనిట్లకు వచ్చి చేరాయి. త్రిచక్ర వాహనాలు 80 శాతం అధికమై 50,349 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 27 శాతం దూసుకెళ్లి 66,459 యూనిట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment