
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో రికార్డు నమోదు చేసింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా 50 లక్షల యూనిట్ల అపాచీ ప్రీమియం మోటార్ సైకిళ్లను విక్రయించి కొత్త మైలురాయిని అధిగమించింది.
2005లో అపాచీ మోటార్ సైకిల్ తొలిసారిగా రోడ్డెక్కింది. 60కిపైగా దేశాల్లో ఈ బైక్స్ పరుగెడుతున్నాయి. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లలో అపాచీ ఒకటిగా నిలివడం విశేషం. సెగ్మెంట్‌లో తొలిసారిగా, అలాగే వినూత్న ఫీచర్లతో ఈ బైక్ అప్‌గ్రేడ్ అవుతూ వస్తోందని కంపెనీ తెలిపింది.
రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్ మోడ్స్, డ్యూయల్ చానెల్‌ఏబీఎస్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటివి వీటిలో ఉన్నాయి. అపాచీ సిరీస్‌లో ఆర్‌టీఆర్ 160, 160 4వీ, 180, 200 4వీ, ఆర్‌ఆర్ 310 మోడళ్లు ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు, సాంకేతికత, శైలితో ప్రీమియం మోటార్‌సైకిల్స్ విభాగంలో అపాచీ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని టీవీఎస్ మోటార్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment