దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుందని సంస్థ పేర్కొంది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్‌లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..?
ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment