Maruti Alto: మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ప్రకటించింది.
ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!)
దేశంలో మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సిఎన్‌జిలను విడుదల చేసింది. 2012 నాటికి 20 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లోఆల్టో 30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గత ఏడాది కంపెనీ మూడవ తరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి)
Comments
Please login to add a commentAdd a comment