లోక్‌సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C
Comments
Please login to add a commentAdd a comment