
సాక్షి, బాపట్ల జిల్లా: నిజాంపట్నంలోని రొయ్యల ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో విష వాయువు లీక్ కావడంతో 30 మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం నిజాంపట్నం, పిట్టలవానిపాలెం ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ఒక చోట మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment