Shrimp processing
-
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో విషవాయువులు లీక్
-
రొయ్యల ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల జిల్లా: నిజాంపట్నంలోని రొయ్యల ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విష వాయువు లీక్ కావడంతో 30 మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం నిజాంపట్నం, పిట్టలవానిపాలెం ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ఒక చోట మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అర్బన్ రొయ్యల చెరువు!
వాడేసిన కార్గో కంటెయినర్లలో లెట్యూస్ వంటి ఆకు కూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్స్ లేదా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో, మట్టి వాడకుండా కేవలం పోషక జలంతో సాగు చేసే అర్బన్ ఫార్మర్స్ చాలా దేశాల్లో ఉన్నారు. అయితే, నగరాల్లో ఆకాశ హర్మ్యాల మధ్య ఐరన్ కంటెయినర్లలో మంచినీటి రొయ్యల సాగు చేయటం.. అందులోనూ పర్యావరణానికి హాని కలిగించని కాలుష్య రహిత సుస్థిర అర్బన్ ఆక్వా సాగు పద్ధతులను అనుసరించడం సుసాధ్యమేనని రుజువు చేస్తోంది ‘అతర్రాయ’ అనే సంస్థ. కొద్దిపాటి శిక్షణతోనే కాలుష్య రహిత పద్ధతిలో కంటెయినర్ రొయ్యల సాగును సులువుగా నేర్పిస్తోంది ఈ సంస్థ. కంటెయినర్లో బయోఫ్లాక్ పద్ధతిలో రొయ్యల సాగు చేసే ‘ష్రింప్ బాక్స్’ సాంకేతికతపై పేటెంట్ పొందిన ఈ సంస్థ మెక్సికో కేంద్రంగా పనిచేస్తోంది. సాధారణ పద్ధతుల్లో సాగే రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్, రసాయనాలు, గ్రోత్ హోర్మోన్స్ వాడుతున్నారు. వ్యర్థ జలాలతో సముద్రం కలుషితమవుతోంది. ‘మేం ఈ సమస్యలేవీ లేకుండా ఎథికల్ ఆక్వాకల్చర్ పద్ధతిలో ఎక్కడ కావాలంటే అక్కడే కంటెయినర్లో సులభంగా రొయ్యలు సాగు చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిగా అందుబాటులోకి తెచ్చామ’ని అతర్రాయ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డేనియల్ రసెక్ అంటున్నారు. రసెక్ మెక్సికోలో కాలేజీ విద్యను పూర్తి చేసుకొని 2005లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఆక్వాకల్చర్‌ను సుస్థిర సేద్య పద్ధతులపై పనిచేయడానికి ఓ స్టార్టప్ సంస్థను స్థాపించారు. ‘మెక్సికో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో విస్తారమైన చెరువుల్లో సాగు పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అతి తక్కువ చోటులో తక్కువ కాలుష్యం కలిగించే సుస్థిర సాగు పద్ధతులపై అధ్యయనం చేపట్టాం. 2019లో ఇతర వనరుల నుంచి ఆర్థిక సహాయం అందిన తర్వాత సాఫ్ట్వేర్, ఆటోమేషన్ ఉపకరణాలను కూడా సమకూర్చుకొని పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగించని ఆరోగ్యదాయకమైన రీతిలో రొయ్యల సాగు చేపట్టే సమగ్ర అత్యాధునిక సాంకేతికతకు తుదిమెరుగులు దిద్దాం’ అని రసెల్ చెబుతున్నారు. కంటెయినర్ రొయ్యల సాగులో మూడు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. బయోఫ్లాక్.. రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. అందువల్ల యాంటీబయోటిక్స్ లేదా హానికరమైన రసాయనాల అవసరమే రాదు. ఈ ష్రింప్ బాక్స్‌లో అన్ని పనులనూ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రించుకునే అవకాశం ఉంది. నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, రొయ్యల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గణాంకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి మేతను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికతను జోడించటం విశేషం. డేటాను బట్టి వర్క్‌ఫ్లో మాపింగ్ చేశారు. కాబట్టి, కంటెయినర్లో రొయ్యల సాగులో ఎవరికైనా అతి సులభంగా శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతోంది. ఎలా పండించారో తెలియని, ఎప్పుడో పట్టుకుని నిల్వ చేసిన రొయ్యలను నగరవాసులు తినాల్సిన అవసరం లేదు. తమ ‘ష్రింప్ బాక్స్’ను నగరం నడిబొడ్డునైనా ఏర్పాటు చేసుకొని రొయ్యలను పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఆరోగ్యదాయకమైన రొయ్యలను ఆరగించవచ్చు అంటున్నారు రసెక్. కంటెయినర్లో 1.5 టన్నుల రొయ్యలు అత్యాధునిక రొయ్యల చెరువుగా మేము రూపుదిద్దిన కార్గో కంటెయినర్ విస్తీర్ణం 50 చదరపు మీటర్లు. దీనిలో ఏటా 1.5 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నాం. సాధారణ చెరువుల్లో ఇన్ని రొయ్యలు పెంచాలంటే కనీసం రెండు హెక్టార్ల భూమి కావాలి. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే రొయ్యలను పెంచడానికి ‘ష్రింప్ బాక్స్’ ఉపయోగపడుతోంది. 70% పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ‘ష్రింప్ బాక్స్’లో రొయ్యలు పెంచడానికి డాక్టరేట్ ఏమీ అక్కర్లేదు. 2–4 వారాల శిక్షణతో ఎవరైనా రొయ్యల రైతుగా మారొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపార విస్తరణే మా లక్ష్యం. – డేనియెల్ రసెక్, ‘ష్రింప్ బాక్స్’ ఆవిష్కర్త, మెక్సికో – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
కోరలు చాచిన కోస్టల్ కాలుష్యం
రొయ్యల ప్రాసెసింగ్ వ్యర్థాలతో కాలుష్యం తీవ్ర దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి జాతీయ రహదారిపై ప్రయాణికుల ఇక్కట్లు కన్నెత్తి చూడని కాలుష్య నియంత్రణ మండలి దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్యంతో కలవరపడుతున్నారు. అనారోగ్యంతో అస్వస్థులవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదు. రొయ్యల పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు నీళ్లొదిలినా చర్యలు తీసుకోవడం లేదు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద ఏర్పాటైన కోస్టల్ ఫుడ్స్ పరిశ్రమ విడుదల చేస్తున్న దుర్గంధంతో స్థానికులు, జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు విలవిల్లాడుతున్నారు. యలమంచిలి/ఎస్.రాయవరం: పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల స్థానికుల ఇబ్బందులను యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి కూడా యాజమాన్యాల నిర్వాకంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పరిశ్రమల వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని జనం గగ్గోలు పెడుతున్నా పీసీబీ ఏమాత్రం చలించడం లేదు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద జాతీయరహదారిని ఆనుకున్న కోస్టల్ ఫుడ్స్ పరిశ్రమ నుంచి వ్యర్థజలాలతోపాటు వెలువడుతున్న తీవ్రమైన దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండేళ్లుగా పరిశ్రమలో రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా అనుమతి విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాలను రొయ్యిలను పరిశ్రమకు తరలించి ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలో రోజుకు 50 టన్నుల వరకు రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు అంచనా. ప్రాసెసింగ్‌లో మిగిలిన పొట్టును పలు పరిశ్రమలకు తరలిస్తుండగా వ్యర్థజలాలను మాత్రం స్థానికంగా పొలాల్లోకి విడిచిపెడుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు పీసీబీ అనుమతులపై యాజమాన్యం ఇప్పటికీ గుంభనంగానే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విడుదలైన దుర్గంధం వల్ల 15మంది మహిళలు అస్వస్థులయ్యారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు పరిశ్రమ పరిసరాలను పరిశీలించి దుర్గంధం, వ్యర్థజలాలపై వివరణ కోరారు. పీసీబీ అనుమతులపై కూడా ఆరా తీశారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు కూడా పరిశ్రమ గురించి పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికార యంత్రాంగాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రలోభాలకు గురిచేయడం వల్లే పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థజలాలు, దుర్గంధం గురించి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులకు పరిశ్రమ యాజమాన్యం తాయిలాలు ఇస్తోందన్న విమర్శలున్నాయి. వ్యర్థజలాలు పంటపొలాలకు విడుదల చేస్తుండటంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాజమాన్యం పంటపొలాలకు వ్యర్థజలాలు వెళ్లకుండా అడ్డుగా గట్టు ఏర్పాటు చేసింది. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న దుర్గంధంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్గంధం రాత్రిళ్లు బాగా ఎక్కువగా ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమ జాతీయరహదారిని ఆనుకుని ఉండటంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు.