nizampatnam
-
రొయ్యల ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల జిల్లా: నిజాంపట్నంలోని రొయ్యల ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విష వాయువు లీక్ కావడంతో 30 మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం నిజాంపట్నం, పిట్టలవానిపాలెం ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ఒక చోట మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బాబుకు షాక్..మా వీధికి రావొద్దు..
-
టీడీపీకి చేదు అనుభవం.. షాక్ ఇచ్చిన స్థానికులు
బాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరిట టీడీపీ కార్యక్రమం చేస్తుండగా, తమ వీధికి రావొద్దంటూ టీడీపీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు స్థానికులతో గొడవకు దిగారు. టీడీపీలో టికెట్ల పంచాయతీ పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్‌ను కొమ్మలపాటి శ్రీధర్ కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కొమ్మలపాటికి టికెట్ కేటాయించాలంటూ తీర్మానించారు. వేరే వారికి టికెట్ కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ చంద్రబాబు, లోకేష్‌లకు టీడీపీ నేతలు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదీ చదవండి: Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు! -
మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్వీట్
తాడేపల్లి: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా మంగళవారం అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. అనంతరం మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టి నాలుగేళ్ల లోపే ఐదు విడతలనూ పూర్తి చేశాం. ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ. 50 వేలను అందజేశాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగేళ్ళలోపే ఐదు విడతలనూ పూర్తి చేసి ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ.50 వేలను అందజేశాం.… pic.twitter.com/79r8mU0wFs — YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2023 చదవండి: జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్ -
జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిజాంపట్నంకు చెందిన బొమ్మిడి బాలరాజు అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘అన్నా నమస్తే, నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చాను, గతంలో మత్స్యకారులకు భరోసా లేదు, గతంలో వేట నిషేద భృతి నామామాత్రం, ఏప్రిల్, మే నెలలో దరఖాస్తు చేస్తే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇచ్చేవారు, అవి కూడా కొందరికే వచ్చేవి, కానీ మన జగనన్న మా కష్టాలు పరిశీలించి మత్స్యకారులను ఆదుకునేలా భరోసా కల్పించారు, సకాలంలో మాకు సాయం అందిస్తున్నారు, ఏటా రూ. 10 వేల చొప్పున అకౌంట్లో వేస్తున్నారు, జగనన్నా మీ మేలు మరిచిపోము, మత్స్యకారుడు గతంలో చనిపోతే శవం కనపడితేనే డబ్బులు ఇస్తామనేవారు, అప్పుడు ఆఫీస్‌ల చుట్టూ తిరగగా తిరగగా ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎప్పటికో ఇచ్చేవారు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్లో వేస్తున్నారు. శవం కనబడినా కనబడకపోయినా సాయం అందుతుంది, గతంలో ఆయిల్ సబ్సిడీ చిన్న బోట్లకు ఉండేది కాదు, కేవలం పెద్ద బోట్లకు కూడా వెయ్యి లీటర్లకే ఇచ్చేవారు, ఆ డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం, కొంతమందికి వచ్చేవే కాదు, కానీ ఇప్పుడు పెద్ద బోట్లకు, చిన్న బోట్లకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, పైగా వెంటనే మన ఖాతాలో, మన మత్స్యకారులంతా జగనన్నను మరిచిపోకూడదు. గతంలో నిజాంపట్నం హార్బర్ లేదు, చాలా కష్టాలు పడ్డాం, సముద్రంలోకి వెళ్ళాలంటే మెరక, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, మన జగనన్న ఆ హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. జగనన్నా నువ్వే మా ధైర్యం, మా నమ్మకం. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి, ధన్యవాదాలు’ అని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని కొనియాడాడు. -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మత్స్యకారులకు మేలు కలిగేలా స్మార్ట్ కార్డుల జారీ
-
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు..
-
వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నాం
-
నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
-
భజన బాబు భజన! ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపంటారు’
సాక్షి, బాపట్ల: నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష టీడీపీ, జనసేనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పనవ్ కల్యాణ్‌కు పొలిటికల్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనేనని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదని.. ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని అన్నారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. వెంటిలేటర్‌పై బాబు పార్టీ చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే జూబ్లీహిల్స్‌లో ఉంటాడని సీఎం జగన్ దుయ్యబట్టారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని మండిపడ్డారు. అయితే ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని.. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషికి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. చదవండి: 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు, ప్రజల తరపున నిలబడ్డా, మంచి చేస్తున్నా: సీఎం జగన్ సీఎం పదవి వద్దు, దోపిడిలో వాటా చాలు.. ‘రెండు చోట్ల పోటీచేస్తే.. మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్లా కూడా దత్తపుత్రుడ్ని ప్రజలు ఓడించే పరిస్థితి. 10 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు సీఎం పదవి వద్దు.. దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడు. గజదొంగల ముఠాగా దోచుకోవడానికి వీరంతా కలుస్తున్నారు. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. 5 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు. పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే. చంద్రబాబు చెప్తే.. దత్తపుత్రుడు చిత్తం ప్రభూ అంటాడు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అదే చేస్తానంటాడు దత్తపుత్రుడు. ఏ పార్టీని కలవాలో దత్తపుత్రుడికి చంద్రాబాబే చెప్తాడు. బాబు చెప్తే దత్తపుత్రుడు బీజేపీ పక్కన చేరతాడు. చంద్రబాబు బీజేపీకి విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 గజదొంగల ముఠా సభ్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు చక్రం తిప్పుతున్నారని రాస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపని పండగ చేసుకుంటారు. కర్ణాటకలో ఓడిన బీజేపీని తమతో కలిసి రావాలని వీళ్లే కోరతారు. వీరు చేస్తుంది జగన్‌తో కాదు జనంతో యుద్ధం. వీరు చేస్తుంది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వారికి లేదు. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు వీర్రవీగారు.. ఇప్పుడేమైంది.. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. ప్రతి సామాజిక వర్గంలో కూడా ప్రతి పేదవారిని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి.. మీ బిడ్డ వారికోసం అనేక చర్యలు తీసుకుంటున్నాడు. అందుకే మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. దత్తపుత్రుడు షూటింగ్‌లకు విరామ సమయంలో బయటకు వస్తాడు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
గంగ పుత్రులకు భరోసా
-
‘ వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల: భారీగా తరలి వచ్చిన జన సందోహం (ఫొటోలు)
-
వైఎస్సార్ మత్స్యకార భరోసా.. వరుసగా ఐదో ఏడాది కూడా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు. గతంతో పోలిస్తే ఆరు రెట్లు అధికం.. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత రూ.4వేల చొప్పున ఇచ్చారు. అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50వేల మందికి రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భృతి రూ.10వేలకు పెంచడమే కాక.. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా చెల్లిస్తోంది. ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ఇక చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొ కుటుంబానికి సగటున రూ.50వేల చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.538 కోట్ల భృతిని అందించారు. డీజిల్ సబ్సిడీ గతం కంటే మిన్నగా.. టీడీపీ హయాంలో 1,100 బోట్లకు లీటర్ డీజిల్‌కు రూ.6 చొప్పున ఏటా సగటున రూ.12 కోట్లు ఆయిల్ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని రూ.9కి పెంచడమే కాక మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. విదేశీ జైళ్లలో మగ్గిన 23 మంది విడుదల వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు గత ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని రూ.10లక్షలకు పెంచింది. అంతేకాదు.. 2018లో పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడగా, 13 నెలల పాటు కరాచీ జైలులో మగ్గిన 23 మత్స్యకారుల విడుదల కోసం కనీస ప్రయత్నం చేయకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీరాగానే విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపింది. వారిని పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. మరోవైపు.. మత్స్యకారుల వలసల నివారణ, వారికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,767.48 కోట్లతో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, రూ.16వేల కోట్లతో నాలుగు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. తద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది. నేడు సీఎం జగన్ నిజాంపట్నం రాక సాక్షి ప్రతినిధి, బాపట్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా పర్యటనకు రానున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉ.11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు. లబ్ధిదారులతోనూ మాట్లాడతారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉ.9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి తిరిగి మ.1.00కు ఇంటికి చేరుకుంటారు. జీవనోపాధి కోల్పోయిన వారికి అండగా.. ఇక ఓఎన్జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్లు కూడా సీఎం జగన్ జమచేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి రూ.393.76 కోట్ల పరిహారం ఇచ్చారు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,43,649 మత్స్యకారులకు రూ.3,835.89 కోట్లు జమచేశారు. మరోవైపు.. ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా దేశీయ వినియోగం పెంచడంతోపాటు ఆక్వా రైతులకు, మత్స్యకారులకు మెరుగైన రేట్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2,184 రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక.. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. -
గంగపుత్రులకు ‘భరోసా’.. భారీగా పెరిగిన అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి పంపిణీకి ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1,23,519 మంది అర్హత పొందగా, వారికి ఈనెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రూ.123.52 కోట్లు జమచేయనున్నారు. గతంలో అరకొరగా సాయం రాష్ట్రంలో తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. వేట నిషేధ వేళ గతంలో రూ.2వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చేవారు. ఆ తర్వాత నిత్యావసరాలు నిలిపివేసి రూ.4వేల చొప్పున భృతి ఇచ్చేవారు. అది కూడా వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాక.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో పాటు సంప్రదాయ నావలపై ఆధారపడి జీవించే వారికి సైతం నిషేధకాలం ముగియకుండానే భృతినందిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ కారణంగా బోట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2019–20 నాటికి రాష్ట్రంలో అన్ని బోట్లు కలిపి 14,299 ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాల సంఖ్య 1.60 లక్షలకు చేరింది. ఐదు రెట్లు పెరిగిన సాయం వేట నిషేధం అమలులోకి వచ్చిన వెంటనే అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఆర్బీకేల్లో పనిచేసే మత్స్య సహాయకులు, వలంటీర్, సాగర మిత్రలతో కూడిన బృందాలు లబ్ధిదారుల గుర్తింపునకు శ్రీకారం చుట్టాయి. తీరానికి చేరుకున్న బోట్లను పరిశీలించి, వాటిపై జీవనోపాధి పొందే మత్స్యకార కుటుంబాలను గుర్తించారు. ఆరు దశల వెరిఫికేషన్ అనంతరం అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది జాబితాలను ప్రకటించారు. ఈ విధంగా 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో బీసీలు 1,17,757 మంది, ఎస్సీలు 2,946, ఎస్టీలు 970, ఓసీలు 1,846 మంది ఉన్నారు. వీరి వివరాలను సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.123.52 కోట్లను ఈనెల 16న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమచేయనున్నారు. కానీ, టీడీపీ ఐదేళ్ల పాలనలో భృతికింద 3 లక్షల మందికి రూ.104.62 కోట్లు ఇస్తే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జమచేయనున్న మొత్తంతో కలిపి ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర సాయమందించింది. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే లబి్ధదారుల సంఖ్య 2.38 లక్షల మేర పెరిగితే, సాయం ఐదు రెట్లు పెరిగింది. మాటల్లో చెప్పలేను.. మా బంధువుకు చెందిన తెప్పపై ఆధారపడి 20 ఏళ్లుగా జీవిస్తున్నా. వేటలేని సమయంలో ఏనాడు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా రూ.10వేల చొప్పున అందిస్తున్న సాయం అక్కరకొస్తోంది. ఎలాంటి పైరవీల్లేకుండా ఎంపిక చేస్తున్నారు. – వై.అప్పలరాజు, రాజయ్యపేట, అనకాపల్లి జిల్లా వరుసగా ఐదో ఏడాది భృతి గడిచిన నాలుగేళ్లుగా వేట నిషేధ కాలం ముగియకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద భృతినందించాం. అదేవిధంగా ఐదో ఏడాది కూడా సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1.23 లక్షల కుటుంబాలు అర్హత పొందగా, వారి ఖాతాల్లో ఈనెల 16న వేట నిషేధ భృతిని జమచేసేందుకు ఏర్పాట్లుచేశాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
గుంటూరు జిల్లాలో 3 కొత్త నగర పంచాయతీలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా త్వరితగతిన వెలువడుతోంది. ఏళ్ల తరబడి కదలని, వదలని సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతోంది. ఇదే కోవలో తాజాగా జిల్లాలో కొత్త నగర పంచాయతీలు ఏర్పాటుకు ముందడుగు పడింది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలను నగర పంచాయతీలుగా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇక తమ ప్రాంతంలో సమస్యలు తీరందాటి అభివృద్ధి పరుగులు తీస్తుందని నిజాంపట్నం వాసులు అంటున్నారు. మరో వైపు పలనాడు రాళ్లపై ఇక అభివృద్ధి రాతలు కనిపిస్తాయని గురజాల, దాచేపల్లి–నడికుడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు కొత్త నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మూడు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా నగర పంచాయతీలు ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీ ముందుకు ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2015లో అప్పటి ప్రభుత్వం మేజర్ పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ఇచ్చిన జీవో తెరమరుగైంది. ఆ జీవోకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీవం పోసి ఈ నెల 31వ తేదీలోపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు సంబంధిత వివరాలు పంపాలని కలెక్టర్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు. ఈ జాబితాలో జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మేజర్ పంచాయతీల సమాచారం సేకరించే పనుల్లో జిల్లా పంచాయతీ(డీపీవో) సిబ్బంది, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారులు నిమగ్నమయ్యారు. 12 అంశాల సేకరణ.. పురపాలక సంఘాలుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల నుంచి 12 అంశాలపై వివరాలు డీపీవో అధికారులు సేకరించనున్నారు. పంచాయతీలో జనాభా, ఓటర్లు, పాఠశాలల సంఖ్య, వార్షిక ఆదాయం, అప్పులు, ఖర్చులు, విస్తీర్ణం సహా 12 అంశాలపై వారు వివరాలు తీసుకుంటున్నారు. రెండు పంచాయతీలు విలీనం.. మండల కేంద్రానికి 2–3 కి.మీ పరిధిలో ఉన్న పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాంపట్నానికి మూడు కి.మీ పరిధిలో ఉన్న ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలను నిజాంపట్నంలోకి విలీనం చేసి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం పంచాయతీలో 19 వేలు, ఆముదాలపల్లి పంచాయతీలో 4 వేలు, బావోపాజీపాలెం పంచాయతీలో 2 వేల జనాభా నివసిస్తున్నారు. అదే విధంగా గురజాల పంచాయతీలో 27 వేలు జనాభా ఉన్నారు. అయితే ఈ గురజాల మండల కేంద్రానికి 3 కి.మీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురాన్ని కలిపి గురజాల నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాచేపల్లి మేజర్ పంచాయతీలో 19 వేలు, నడికుడి పంచాయతీలో19 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో దాచేపల్లి–నడికుడి, నిజాంపట్నం, గురజాల పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపామని కోరారు. ఆయా పంచాయతీల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, ఖర్చులు, పాఠశాలల సంఖ్య సహా 12 అంశాలపై వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోపు వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతాం. – సూర్యప్రకాష్, ఇన్చార్జి డీపీఓ మేజర్ పంచాయతీల పేర్లు జనాభా కుటుంబాలు దాచేపల్లి – నడికుడి 38,462 9,800 నిజాంపట్నం (ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలు కలిపి) 25,547 6,803 గురజాల (జంగమహేశ్వరపురం కలిపి) 28,642 6,932 -
నిజాంపట్నం కాల్వలో మృతదేహాల కలకలం
-
భూకుంభకోణంలో కొత్తకోణం
గుంటూరు : నిజాంపట్నం మండలం దిండి ప్రభుత్వ భూముల కుంభకోణంలో కోత్త కోణం వెలుగులోకి వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు ఉన్నట్లు రికార్డులు సృష్టించి బ్యాంకుల ద్వారా తెలుగు తమ్ముళ్లు ఆరు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని వెల్లడించారు. తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ సొమ్మును కొట్టేయడాన్ని ఆధారాలతో కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దిండిలో తెలుగుదేశం నేతలు చేసిన కుంభకోణం పై పూర్తి స్ధాయిలో విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఎక్కడైనా చర్చకు సిద్దమని, ప్రభుత్వ భూముల్నికాపాడాలని వెంకటరమణ కోరారు. కబ్జాచేసిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని, భూములు స్వాధీనం చేసుకుని వెంటనే వాటిని దిండి గ్రామంలోని పేదలు పంచాలని కోరారు. -
హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచిక
నిజాంపట్నం: వార్దా తుపాను ప్రభావంతో హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జరవేటర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. వార్దా తుపాను చెనై్న పయనిస్తోందని సోమవారం అక్కడే తీరందాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈదురుగాలులు రేవును తాకవచ్చన్న.. సమాచారం ఉన్నప్పుడు మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేస్తారని తెలిపారు. సముద్రపు వేటలో ఉన్న బోట్లన్నీ వేట నుంచి తిరిగి హార్బర్ ఒడ్డుకు చేరాయని ఆయన వివరించారు. తుపాను ప్రభావంపై తెనాలి ఆర్డీవో అధికారులతో చర్చ.. తెనాలి ఆర్డీవో నరసింహులు ఆదివారం హార్బర్లో పర్యటించి మత్స్యశాఖ అధికారులతో, పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావుతో చర్చించారు. తుపాను ప్రభావం తీరప్రాంతంపై ఏవిధంగా ఉండబోతోందన్న అంశంపై మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండే అవకాశం లేదని, అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్ పి.మోహన్‌కృష్ణ తదితరులున్నారు. -
హార్బర్లో రెండో ప్రమాద సూచిక
నిజాంపట్నం: వర్ధా తుఫాను హెచ్చరికలతో నిజాంపట్నం హార్బర్లో రెండో నంబరు ప్రమాద సూచిక కొనసాగుతున్నదని పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారటంతో మూడు రోజులుగా రెండో నంబరు ప్రమాద సూచికను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం–నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తీరం దాటే సమయంలో ఒక మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
నిజాంపట్నంలో త్వరలో మెరైన్ పోలీస్‌స్టేషన్
జెట్టీ నిర్మాణం కూడా.. రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.. మెరైన్ ఐజీ సూర్యప్రకాశరావు నిజాంపట్నం : రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని మెరైన్ ఐజీ జి.సూర్యప్రకాశరావు తెలిపారు. బొర్రావారిపాలెంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. గతంలో ఐజీ కార్యాలయం హైదరాబాద్‌లో ఉండేదని గత ఏడాది డిసెంబర్లో విశాఖపట్నానికి మార్చినట్లు తెలిపారు. మెరైన్ బోట్లను నిలిపేందుకు ఫేజ్–1 కింద రాష్ట్రంలో 7 జెట్టీలు మంజూరయ్యాని చెప్పారు. వీటి నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఫేజ్–2 కింద మరో 14 జెట్టీలు మంజూరు కావాల్సిఉందని పేర్కొన్నారు. ఫేజ్–1 కింద రాష్ట్రంలో 18 మెరైన్ బోట్లు మంజూరయ్యాయని, ఫేజ్–2 కింద మరో 30 మెరైన్ బోట్లు రావాల్సి ఉందన్నారు. సముద్రంలో 25 కిలోమీటర్ల దూరం వరకూ మెరైన్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలో మచిలీపట్నంలో 250 ఎకరాల స్థలంలో మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.త్వరలో నిజాంపట్నంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం రూ.70 లక్షలతో త్వరలో నిజాంపట్నంలో మెరైన్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఐజీ సూర్యప్రకాశరావు తెలిపారు. స్టేషన్ నిర్మాణానికి అవసరమైన 15 సెంట్ల స్థలాన్ని దాతలు ఇచ్చారని చెప్పారు. మెరైన్ బోట్లు ఆగేందుకు నిజాంపట్నంలో రూ.50 లక్షలతో జెట్టీని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. నిజాంపట్నానికి త్వరలో రెండు మెరైన్ బోట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. -
భార్యను చంపిన ఆర్మీ ఉద్యోగి
నిజాంపట్నం (గుంటూరు) : భార్యను కిరాతకంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించిన ఓ ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఆదివారం వెలుగుచూసింది. నిజాంపట్నంకు చెందిన లెనిన్(25) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా నివాసముంటున్న షీలం సూర్యగౌతమి(20)ని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీనికి ఇద్దరి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కులాంతర వివాహం కావడంతో.. పెళ్లి సమయంలో వధువుకు 50 సెంట్ల భూమిని భరణంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మని భార్యతో గత కొన్ని రోజులుగా గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమెను హతమార్చి.. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నిజాంపట్నంలో దారుణం
గుంటూరు : గుంటూరు జిల్లా నిజాంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆర్మీ ఉద్యోగి... తన భార్యను ఉరేసి చంపేశాడు. అనంతరం భార్యే ఆత్మహత్య చేసుకుందని... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో ఆర్మీ ఉద్యోగిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో తన భార్యను తానే హత్య చేసినట్లు ఆర్మీ ఉద్యోగి ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుపై ప్రభుత్వం చిన్నచూపు : మోపిదేవి
నిజాంపట్నం (గుంటూరు) : ఇకనైనా సీఎం చంద్రబాబు రాజధాని జపం మాని రైతుల జపం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు హితవు పలికారు. మంగళవారం నిజాంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు లేక నారుమడులు పొయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో రైతులు ఉంటే, వారికి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు మనోధైర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల గత బకాయిలు చెల్లించక బ్యాంకర్లు క్రాప్ లోనులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమేనని అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రాజధాని జపమే తప్ప సీఎం చంద్రబాబు రైతుల గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులపై దాడులు అధికమౌతున్నాయని మోపిదేవి ఆరోపించారు. మహిళా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెలేపై చర్యలు తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు. దానిని ఆసరాగా తీసుకుని విఆర్వో, విఆర్ఎలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులను పార్టీ తరుఫున ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.