1/12
వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది.
2/12
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేశారు.
3/12
ప్రజా నాయకుడు వైఎస్ జగన్ కాన్వాయ్‌పై అభిమానులు పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
4/12
మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేశారు.
5/12
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు.
6/12
టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత రూ.4వేల చొప్పున ఇచ్చారు.
7/12
అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50వేల మందికి రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారు.
8/12
కానీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భృతి రూ.10వేలకు పెంచడమే కాక.. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా చెల్లిస్తోంది.
9/12
ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ఇక చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.
10/12
నేడు అందించిన సాయంతో కలిపి ఒక్కొ కుటుంబానికి సగటున రూ.50వేల చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.538 కోట్ల భృతిని అందించారు.
11/12
CM Jagan-Bapatla : నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
12/12
CM Jagan-Bapatla : నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)