YSR Matsyakara Bharosa
-
గంగపుత్రులకు ఏదీ భరోసా?
సాక్షి, అమరావతి : వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలవుతుంది. ఈ సమయంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వేట తప్ప వారికి మరో వృత్తి చేతకాదు. వేటకు వెళ్తే కానీ పూట గడవని బతుకులు వారివి. వేట మీద ఆధారపడి జీవనోపాధి పొందే ప్రతీ మత్స్యకారునికి నిషేధ కాలంలో కుటుంబ పోషణ కోసం చాలా ఏళ్లుగా వేట నిషేధ భృతిని ప్రభుత్వం అందిస్తోంది.గత ఐదేళ్లుగా వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల చొప్పున భరోసా ఇవ్వగా, తాము అధికారంలోకి రాగానే రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వేట గడువు ముగిసినప్పటికీ నిషేధ భృతి చేతికి అందక మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.ఐదేళ్లూ గడువులోగానే మత్స్యకార భరోసా వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు పూర్వం రూ.2 వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చే వారు. ఆ తర్వాత నిత్యావసరాలకు పుల్‌స్టాప్ పెట్టి రూ.4 వేల చొప్పున భృతి ఇచ్చారు. అది కూడా వేట నిషేధం ముగిసిన తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఎప్పుడిచ్చేది కూడా తెలిసేది కాదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి నిషేధ కాలంలోనే పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా.. తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని వర్తింప చేసింది. 2014–19 మధ్య ఏటా సగటున 60 వేల మందికి ఐదేళ్లలో రూ.104.62 కోట్లు జమ చేయగా, 2019–24 మధ్య ఏటా సగటున 1.16 లక్షల మంది మత్స్యకారులకు ఐదేళ్లలో రూ.538 కోట్లు జమ చేశారు. ఎన్నికల వేళ.. గడువులోగా ఇచ్చేలాఎన్నికల వేళ క్షణం తీరక లేని పరిస్థితుల్లో సైతం గత ఐదేళ్ల మాదిరిగానే వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతీ మత్స్యకారునికి వేట నిషేధ భృతిని అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. తొలుత ఎన్నికల కోడ్ సాకుతో అర్హుల గుర్తింపును విపక్షాలు అడ్డుకోగా, నిషేధ సమయంలోనే వారికి ఈ సాయం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు లేఖలు రాసింది. ఫలితంగా ఈసీ అనుమతితో మే 2వ తేదీ నుంచి తీర ప్రాంత గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా అర్హుల గుర్తింపు చేపట్టింది.2023–24 సీజన్లో 1.23 లక్షల మంది అర్హత పొందితే, 2024–25 సీజన్లో 1,30,128 మంది అర్హత పొందారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శనకు సైతం పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి చెల్లించేందుకు రూ.260.26 కోట్లు అవసరమని మత్స్య శాఖ ప్రతిపాదనలు పంపింది. గడువు ముగిసి రెండు వారాలు కావస్తున్నా, మత్స్యకార భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుండడం పట్ల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చాలా ఇబ్బంది పడ్డాంవేట నిషేధంలో సమయం అందే మత్స్యకార భరోసా ఈ సంవత్సరం వేట నిషేధం ముగిసినప్పటికీ జమ చేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది వేట నిషేధ గడువు ముగిసి 15 రోజులు కావస్తున్నా, ఎలాంటి సాయం అందించలేదు. ప్రస్తుతం సరైన వేట లేక, పూట గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. – వై రాజు, మత్స్యకారుడు, అమీనాబాద్, కాకినాడ జిల్లాఅప్పులు చేసి తినాల్సి వచ్చేదిమాకు వేట తప్ప మరో పనిరాదు. వేట నిషేధ సమయంలో పిల్లాపాపలతో ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఆ రెండు నెలలు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటుంది. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయంతోనే ఇల్లు గడుస్తుంది. ఐదేళ్లుగా ఇదే రీతిలో సాయం అందింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేలు నిషేధ గడువు ముగియక ముందే ఇచ్చి ఉంటే బాగుండేది. ఈసారి అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. – అర్జిల్లి రామకృష్ణ, వెంకటనగరం, అనకాపల్లి జిల్లాఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగతంలో రూ.4 వేలు చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి, ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే జమ చేసేది. పైగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని అందించింది. మత్స్యకారుల సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తామని ఎన్నికల వేళ టీడీపీ కూటమి నేతలు హామీలిచ్చారు. తాము అధికారంలోకి రాగానే రూ.20 వేలు ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకొని ప్రతి మత్స్యకారునికి భృతి అందించాలి. – ఆవల శ్రీను, మత్స్యకారుడు, విజయలక్ష్మీపురం, బాపట్ల జిల్లాఎప్పుడు ఇస్తారో చెప్పండిఐదేళ్లుగా ఏటా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమయ్యేది. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి భృతి చెల్లింపులో ఆలస్యం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా భృతి చెల్లింపునకు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు చెల్లిస్తారో తేదీ ప్రకటించాలి. – చిన్నపిల్లి నీలయ్య, మత్స్యకారుడు, చింతపల్లి, పూసపాటిరేగ మండలం, విజయనగరం జిల్లాఅనుమానంగా ఉందిచంద్రబాబు ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ వేట నిషేధ కాలం ముగిసినా ఇంత వరకు మత్స్యకార భరోసాపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో మత్స్యకార భరోసా ఇస్తారా, ఇవ్వరా అని సందిగ్ధంగా ఉంది. – వాయిల యానాదిరావు, చెల్లెమ్మగారి పట్టపుపాలెం, పాకల పంచాయతీ, ప్రకాశం జిల్లాఅనుమానంగా ఉందిచంద్రబాబు ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ వేట నిషేధ కాలం ముగిసినా ఇంత వరకు మత్స్యకార భరోసాపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో మత్స్యకార భరోసా ఇస్తారా, ఇవ్వరా అని సందిగ్ధంగా ఉంది. – వాయిల యానాదిరావు, చెల్లెమ్మగారి పట్టపుపాలెం, పాకల పంచాయతీ, ప్రకాశం జిల్లాఎదురు చూస్తున్నాంమత్స్యకార భరోసా సొమ్ము మా ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. గత ఐదేళ్లూ చెప్పిన తేదీన ఇచ్చారు. పని లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు సొమ్ము రావడంతో ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కూటమి సర్కార్ వస్తే మత్స్యకార భరోసా ఇంకా ఎక్కువగా ఇస్తామన్నారు. కానీ ఇంత వరకు ఎవరూ స్పందించ లేదు. – తిరుమాని దేవేంద్రరాజు, మత్స్యకారుడు, వేములదీవి వెస్ట్ గ్రామం, పశ్చిమగోదావరి జిల్లావెంటనే సాయం అందజేయాలిమత్స్యకారులకు వేటే జీవనాధారం. రెండు నెలలు వేట విరామ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అప్పులు చేశాం. ఇప్పుడు ఆ అప్పు తీర్చాలంటే భృతి రూ.20 వేలు వెంటనే ఇవ్వాలి. ప్రస్తుతం వేట నిషేధం పూర్తయినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. వెంటనే భృతిని అందజేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – గండుపల్లి హరిదాసు, చేపల గొల్లగండి, సోంపేట మండలం, శ్రీకాకుళం గ్రామంవేటకు వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.20 వేలు ఇవ్వాలిసబ్సిడీ ఆయిల్ వినియోగంతో ముడి పెట్టకుండా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇవ్వాలి. గత ఐదేళ్లుగా వేట నిషేధ సమయంలోనే క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా ఇచ్చారు. అదే రీతిలో నిషేధ సమయంలోనే భృతిని అందించి అండగా నిలవాలి. – వాసుపల్లి జానకీరాం, అధ్యక్షుడు, ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్ల సంఘం -
ఏం మాయ చేశారో..
దేశంలోనే ఇదివరకెన్నడూ చూడని జనరంజక పాలన.. గ్రామ/వార్డు సచివాలయాలతో ప్రజల ముంగిట్లోనే అన్ని ప్రభుత్వ సేవలు.. విద్యార్థులు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, ఇతర అభాగ్యులు.. ఇలా అందరికీ ఏదో ఒక రూపంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ సాయం.. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ చదువుల్లో విప్లవాత్మక మార్పులు.. నాడు – నేడుతో పాఠశాలల ఆధునీకరణ.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో విద్యా బోధన.. ఇంగ్లిష్ మీడియం చదువులు.. బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన.. ఇలా ఎన్నో రూపాల్లో సహకారం.. పీహెచ్‌సీల నుంచి ప్రభుత్వాస్పత్రుల వరకూ ఆధునీకరణ, ఆధునిక పరికరాల ఏర్పాటు, మెరుగైన వైద్య సేవలు, మునుపెన్నడూ ఎవ్వరూ ఎరుగని విధంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ కంటి వెలుగు.. ఇంకా వేలాది మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అడుగడుగునా అండదండలు.. వారి ప్రాణరక్షణకు పటిష్ట చర్యలు..అందరినీ ఆదుకునే అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకూ అడుగడుగునా అండ.. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందజేత.. ఇంకా మత్స్యకారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా.. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం.. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర.. ఇంకా ఎవరికైనా అనుకోని కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా.. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పన.. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహం, ఫిషింగ్ హార్బర్లు.. ఇలా గడచిన ఐదేళ్ల పాటు ఎన్నో రూపాల్లో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి.. అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పి.. ప్రభుత్వం అంటే ప్రజల కోసమే పని చేసేదని అడుగడుగునా చాటి చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకే ఐదేళ్ల అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని వైఎస్సార్ సీపీకే మెజారిటీ ప్రజలు ఓట్లు వేశారు. కానీ, తాము వేసిన ఓట్లు ఏమయ్యాయనే ప్రశ్న ఇప్పుడు వారిని వేధిస్తోంది. ఆ పార్టీకి అత్యధికంగా ఓట్లు పోలైన చోట్ల కూడా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులకు మెజారిటీలు రావడం అనేక మంది ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. సీఎం జగన్ పాలన పట్ల పెద్దగా ప్రజా వ్యతిరేకత లేనేలేదు. అలాగని కూటమి నేతల పట్ల సానుభూతీ లేదు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలూ వైఎస్సార్ సీపీ విజయం నల్లేరుపై నడకేనని ఢంకా బజాయించి మరీ చెప్పాయి. మరి అటువంటప్పుడు వైఎస్సార్ సీపీ ఎందుకు ఓడిపోయింది? ఒకవేళ ఓడినా.. అంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి? పైగా కూటమి అభ్యర్థులకు అంతంత భారీ మెజారిటీలు రావడమేమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు పలువురు ఓటర్లు వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా కుట్ర జరిగిందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదు వైఎస్సార్ సీపీకి ఫలితాలు ఇంత దారుణంగా వస్తాయని ఊహించలేదు. ఇది మాకు తట్టుకోలేని విషయం. ఎన్నో రోజులు కష్టపడి ప్రతి ఓటరునూ కలసి, పారీ్టకి ఓట్లు వేయించాం. కానీ ఫలితాలు ఇలా రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బీఎస్ రాజు, నడుపల్లి, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా ఇలా ఎందుకు జరిగిందో!ప్రజా సంక్షేమమే శ్వాసగా జగన్మోహన్రెడ్డి పాలన సాగించారు. ఆయనకు ప్రజలందరూ మద్దతు తెలిపినా ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడం ఏమిటో తెలియడం లేదు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. – రేకాడి జగన్మోహన్, రాజేంద్ర నగర్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా మా ఓట్లు ఏమైపోయాయో? జి.మేడపాడు గ్రామంలో ఎవరిని అడిగినాÐð వైఎస్సార్ సీపీకే ఓట్లు వేశామని చెబుతున్నారు. నేను, నా కుటుంబం అంతా ఫ్యాను గుర్తుకే ఓట్లు వేశాం. అయితే ఆ ఓట్లు ఏమైపోయాయో అర్థం కావడం లేదు. జి.మేడపాడు గ్రామంలో 102 నుంచి 109 వరకూ పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 106 మినహా మిగిలిన అన్ని బూత్‌లలోనూ టీడీపీకి ఎక్కువ ఓట్లు పడినట్లు ఫలితాలు రావడం ఆశ్చర్యంగా ఉంది. వైఎస్సార్ సీపీ అభిమానుల బూత్‌లలోనూ ఫలితాలు తారుమారయ్యాయి. – పుట్టా బుజ్జిబాబు, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా ఈ ఫలితాలు దారుణం సార్వత్రిక ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు చాలా దారుణం. కావాలనే కూటమి నేతలు కుయుక్తులు పన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం వైఎస్సార్ సీపీ వైపే ఉన్నా, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినా, కూటమి అభ్యర్థులకు పడేలా చేశారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. – గవరసాని సూరిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు,కాండ్రకోట, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా అర్థం కాలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా, ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి, మా పిల్లల చదువులను వైఎస్ జగన్మోహన్రెడ్డి మెరుగుపరిచారని తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చేవారు. వాటితో పాటు అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌కే మా ఓటు అని ప్రజలు చెప్పారు. కానీ ఓటు వేసే విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు. – వేగి రామకృష్ణ, కిర్లంపూడి, కాకినాడ జిల్లా జనసేనకు ఇంత మెజార్టీయా..! నేను, నా కుటుంబం వైఎస్సార్ సీపీకే ఓటు వేశాం. మా గ్రామంలో, మా నియోజకవర్గంలో ప్రజలు అత్యధికంగా వైఎస్సార్ సీపీకే ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యమనిపించాయి. అందులోనూ మా నాయకుడు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కన్నబాబుపై జనసేన అభ్యర్థికి 72 వేల మెజార్టీ రావడం ఆశ్చర్యం. ఇది నమ్మశక్యంగా లేదు. నాలాగే చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. – కరీం బాషా, వాకలపూడి, కాకినాడ రూరల్ అయోమయంగా ఉంది ఎన్నికల ఫలితాలు అయోమయానికి గురి చేశాయి. అన్ని సామాజిక వర్గాల వారూ వైఎస్సార్ సీపీకే ఓట్లు వేశారు. ఎన్నికల రోజున అడిగితే ఫ్యాన్ గుర్తుకే వేశామని ఎక్కువ శాతం మహిళలు, వృద్ధులు తెలిపారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే కూటమికి మెజార్టీ చూపించింది. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. – చింతా ఈశ్వరరావు, వైఎస్సార్ సీపీ కరప మండల అధ్యక్షుడు, పెద కొత్తూరు, కాకినాడ జిల్లా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పేనా!ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజలకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. మేమందరం వైఎస్సార్ సీపీకే పట్టం కట్టేందుకు ఓటు వేశాం. వైఎస్సార్ సీపీయే ఘన విజయం సాధిస్తుందని ఎంతో ఆకాంక్షించాం. ఫలితాలు చూస్తుంటే ఇది నిజమేనా అని అనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదేనా అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాం. – జక్కి శ్రీనివాసరావు, ఉప్పరగూడెం, నాగులపల్లి, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా నమ్మబుద్ధి కావడం లేదు ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఇంత దారుణమైన ఓటమా! ఆశ్చర్యంగా ఉంది. సంక్షేమ ఫలాలను దళారీలు లేకుండా నేరుగా లబి్ధదారుకు చేర్చడమే నేరమైందా? ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన ఘనతను మూట కట్టుకున్న నాయకుడికిచ్చే ప్రతిఫలమిదా? అన్ని వర్గాలకూ మేలు చేసినా కూడా ఓటమి పాలయ్యారంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఇంత వ్యత్యాసం అంటేనే నమ్మబుద్ధేయడం లేదు. – నల్లమిల్లి నానాజీ, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లావైఎస్సార్ సీపీకే ఓటేశాం మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా అధికారం చేపట్టాలని కోరుకుంటూ మేమందరం వైఎస్సార్ సీపీకే ఓటు వేశాం. ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ఫలితాలు నిజమేనా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అభ్యర్థులకు భారీ మెజారీ్టలు రావడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. – చింతపల్లి గోపాల్‌రెడ్డి, నాగులపల్లి, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా జీరి్ణంచుకోలేకపోతున్నాం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమిని జీరి్ణంచుకోలేకపోతున్నాం. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో కష్టపడి పని చేశాం. నాయకులు, కార్యకర్తలందరం కలసికట్టుగా పని చేశాం. ప్రతి ఓటరునూ కలిసి ఓటు అభ్యరి్థంచాం. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి, అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాం. మొదటి నుంచీ విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాం. ఎన్నికలు జరిగిన తరువాత ఆ ఆశాభావం మరింత పెరిగింది. కౌంటింగ్ రోజు వరకూ గెలుపు అంచున ఉన్నామనే భావించాం. ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్య ఓటమి హృదయాలను రగిలించింది. – వెలగా వెంకట కృష్ణాజీ, తుని ఏఎంసీ వైస్ చైర్మన్, కోటనందూరు, కాకినాడ జిల్లాఈవీఎంలపై అనుమానం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అనుమానం ఉంది. మేమంతా ఫ్యాన్ గుర్తుపై గంపగుత్తగా ఓట్లు వేశాం. ఈవీంలపై చేపట్టిన కౌంటింగ్ విధానంలో ఎక్కడో మోసం జరిగిందని భావిస్తున్నాను. లేకుంటే అంత స్థాయిలో మెజార్టీలు వచ్చాయంటే, తప్పనిసరిగా ఎక్కడో ఏదో మోసం జరిగింది. – గిడుతూరి రమణమ్మ, గుమ్మరేగుల, రౌతులపూడి మండలం, కాకినాడ జిల్లా -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్‌కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
మన తీరం.. మత్స్య హారం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తీరం వెంట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. మనకున్న 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటన్నిటివల్ల మత్స్యకారులు ఎక్కడెక్కడికో వలస వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున ఆర్నెళ్లకు రూ.69,000 మేర పరిహారం చెల్లిస్తూ మొత్తం రూ.161.86 కోట్లను మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రూ.20 వేల కోట్లతో తీరంలో సదుపాయాలు మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు నాలుగు పోర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పోర్టులను దాదాపు రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్ హార్బర్లను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తుండగా మరో రూ.200 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల పైచిలుకు సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ మంచి మనసుతో ముందుకొచ్చింది. మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి సాయం అందిస్తూ ఆదుకుంటున్నాం. క్రమం తప్పకుండా డబ్బుల విడుదల కోసం గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ ను అభినందించాలి. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు ఇచ్చాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో 7,050 కుటుంబాలకు మంచి చేస్తున్నాం. బాబు సర్కారు ఆలకించలేదు.. 2012కు సంబంధించి జీఎస్పీసీ రూ.78 కోట్లు పరిహారంగా 16,554 కుటుంబాలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్నెళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మేలు చేస్తూ ఆ రూ.78 కోట్లను 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు అందచేశాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలుగా భావించి వారికి తోడుగా నిలుస్తూ గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్జీసీ టేకోవర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్జీసీ దృష్టికి తేవడంతో రెండు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. అయితే ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తున్నాం. 1.07 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ.538 కోట్లు సాయంగా అందించాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికీ సాయాన్ని ఏటా అందించాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చి పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4 వేలుగా ఉన్న సాయాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు. రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ గతంలో డీజిల్‌పై లీటరుకు రూ.6 మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9కి పెంచాం. నాడు ఆ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి ప్రతి మత్స్యకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చాం. డీజిల్ పోయించుకున్నప్పుడే రూ.9 సబ్సిడీ ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చాం. రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా వేటకు వెళ్లే మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్Šగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే రూ.5 లక్షలు పరిహారంగా చెల్లిస్తూ మిగిలిన అమౌంట్‌ను ఆర్నెళ్లలోగా అందజేసే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 175 కుటుంబాలకు మంచి చేస్తూ మరో రూ.17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. జీఎస్పీతో మొదట రూ.78 కోట్లు, ఓఎన్జీసీతో ఐదు దఫాల్లో రూ.647 కోట్లు అందచేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. 40,850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ దాదాపు రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఆరు కార్యక్రమాలతో రూ.4,913 కోట్లు అందించాం. ఇవికాకుండా నవరత్నాల ద్వారా అదనంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం. కార్యక్రమంలో ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జువ్వలదిన్నెకు స్వయంగా వస్తా ‘‘ఇవాళే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించాలని తొలుత అనుకున్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేనే నేరుగా అక్కడకు వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించా. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మత్స్యకారులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలియచేసేందుకు నేనే స్వయంగా వెళ్లి ఆ హార్బర్‌ను ప్రారంభిస్తా. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాలు మారతాయి. ఒక్కో ఫిషింగ్ హార్బర్లో ఎన్ని బోట్లు ఉంటాయి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయాలు అందరికీ తెలియాలి. అందుకే అక్కడ ఇవాళ తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ చేతి నుంచే ఆరో విడత కూడా.. రాష్ట్రంలో మత్స్యకార సోదరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మత్స్యకారుల బతుకుదెరువు, ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా మీరు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందడం మీ వల్లే సాధ్యమైంది. మళ్లీ మీ చేతుల మీదుగా ఆరో విడత కూడా తీసుకుంటాం. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరువలేనిది. – పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే, ముమ్మిడివరం ఆశ వదిలేసుకున్న డబ్బులు అందుకుంటున్నాం.. గత ప్రభుత్వంలో రావనుకున్న డబ్బులు మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.2,07,000 తీసుకున్నాం. ఇప్పుడు ఐదో విడతలో రూ. 69,000 అందుకుంటున్నాం. వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వంలో అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మత్స్యకార భరోసా, సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. గతంలో మాకు బీమా వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు. నాకు అమ్మ ఒడి సాయం అందింది. మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5,32,000 మేర లబ్ధి చేకూరింది. ఆసరా సాయం కింద అందిన రూ.42 వేలతో కుట్టుమిషన్లు కొనుక్కున్నా. మా అమ్మకు చేయూత సాయం అందింది. –నారాయణమ్మ, లబ్ధిదారు, కోనసీమ జిల్లా అన్నీ ఇస్తున్నారు.. గతంలో మా గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా మత్స్యకారులందరికీ మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ గతంలో కొందరికే అందగా ఇప్పుడు అర్హత ఉంటే చాలు అందరికీ ఇస్తున్నారు. గతంలో బీమా సాయం అందేది కాదు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. గతంలో ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామన్నా. – భైరవమూర్తి, వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, కాకినాడ జిల్లా -
మా ఎన్నో ఏళ్ల నాటి కల జగన్ గారి వల్ల సాకారం కానుంది
-
మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్వీట్
తాడేపల్లి: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా మంగళవారం అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. అనంతరం మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టి నాలుగేళ్ల లోపే ఐదు విడతలనూ పూర్తి చేశాం. ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ. 50 వేలను అందజేశాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగేళ్ళలోపే ఐదు విడతలనూ పూర్తి చేసి ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ.50 వేలను అందజేశాం.… pic.twitter.com/79r8mU0wFs — YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2023 చదవండి: జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్ -
జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిజాంపట్నంకు చెందిన బొమ్మిడి బాలరాజు అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘అన్నా నమస్తే, నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చాను, గతంలో మత్స్యకారులకు భరోసా లేదు, గతంలో వేట నిషేద భృతి నామామాత్రం, ఏప్రిల్, మే నెలలో దరఖాస్తు చేస్తే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇచ్చేవారు, అవి కూడా కొందరికే వచ్చేవి, కానీ మన జగనన్న మా కష్టాలు పరిశీలించి మత్స్యకారులను ఆదుకునేలా భరోసా కల్పించారు, సకాలంలో మాకు సాయం అందిస్తున్నారు, ఏటా రూ. 10 వేల చొప్పున అకౌంట్లో వేస్తున్నారు, జగనన్నా మీ మేలు మరిచిపోము, మత్స్యకారుడు గతంలో చనిపోతే శవం కనపడితేనే డబ్బులు ఇస్తామనేవారు, అప్పుడు ఆఫీస్‌ల చుట్టూ తిరగగా తిరగగా ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎప్పటికో ఇచ్చేవారు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్లో వేస్తున్నారు. శవం కనబడినా కనబడకపోయినా సాయం అందుతుంది, గతంలో ఆయిల్ సబ్సిడీ చిన్న బోట్లకు ఉండేది కాదు, కేవలం పెద్ద బోట్లకు కూడా వెయ్యి లీటర్లకే ఇచ్చేవారు, ఆ డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం, కొంతమందికి వచ్చేవే కాదు, కానీ ఇప్పుడు పెద్ద బోట్లకు, చిన్న బోట్లకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, పైగా వెంటనే మన ఖాతాలో, మన మత్స్యకారులంతా జగనన్నను మరిచిపోకూడదు. గతంలో నిజాంపట్నం హార్బర్ లేదు, చాలా కష్టాలు పడ్డాం, సముద్రంలోకి వెళ్ళాలంటే మెరక, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, మన జగనన్న ఆ హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. జగనన్నా నువ్వే మా ధైర్యం, మా నమ్మకం. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి, ధన్యవాదాలు’ అని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని కొనియాడాడు. -
నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
-
భజన బాబు భజన! ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపంటారు’
సాక్షి, బాపట్ల: నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష టీడీపీ, జనసేనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పనవ్ కల్యాణ్‌కు పొలిటికల్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనేనని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదని.. ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని అన్నారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. వెంటిలేటర్‌పై బాబు పార్టీ చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే జూబ్లీహిల్స్‌లో ఉంటాడని సీఎం జగన్ దుయ్యబట్టారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని మండిపడ్డారు. అయితే ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని.. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషికి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. చదవండి: 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు, ప్రజల తరపున నిలబడ్డా, మంచి చేస్తున్నా: సీఎం జగన్ సీఎం పదవి వద్దు, దోపిడిలో వాటా చాలు.. ‘రెండు చోట్ల పోటీచేస్తే.. మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్లా కూడా దత్తపుత్రుడ్ని ప్రజలు ఓడించే పరిస్థితి. 10 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు సీఎం పదవి వద్దు.. దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడు. గజదొంగల ముఠాగా దోచుకోవడానికి వీరంతా కలుస్తున్నారు. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. 5 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు. పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే. చంద్రబాబు చెప్తే.. దత్తపుత్రుడు చిత్తం ప్రభూ అంటాడు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అదే చేస్తానంటాడు దత్తపుత్రుడు. ఏ పార్టీని కలవాలో దత్తపుత్రుడికి చంద్రాబాబే చెప్తాడు. బాబు చెప్తే దత్తపుత్రుడు బీజేపీ పక్కన చేరతాడు. చంద్రబాబు బీజేపీకి విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 గజదొంగల ముఠా సభ్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు చక్రం తిప్పుతున్నారని రాస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపని పండగ చేసుకుంటారు. కర్ణాటకలో ఓడిన బీజేపీని తమతో కలిసి రావాలని వీళ్లే కోరతారు. వీరు చేస్తుంది జగన్‌తో కాదు జనంతో యుద్ధం. వీరు చేస్తుంది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వారికి లేదు. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు వీర్రవీగారు.. ఇప్పుడేమైంది.. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. ప్రతి సామాజిక వర్గంలో కూడా ప్రతి పేదవారిని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి.. మీ బిడ్డ వారికోసం అనేక చర్యలు తీసుకుంటున్నాడు. అందుకే మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. దత్తపుత్రుడు షూటింగ్‌లకు విరామ సమయంలో బయటకు వస్తాడు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల: భారీగా తరలి వచ్చిన జన సందోహం (ఫొటోలు)
-
15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు, ప్రజల తరపున నిలబడ్డా: సీఎం జగన్
Updates: ► బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ ►ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. ►ప్రధానిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తారు. ►బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు. ►పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. ►వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే.. ►ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు. ►బాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనే ►చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదు ► ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటే ►చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్ ►ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని ►ఏపీలోనే నా శాశ్వత నివాసం ఉంది. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నా ►ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? ►175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయనకు సభలు పెట్టే ధైర్య కూడా లేదు ►చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. ►అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు. ►మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. ►పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు. ►ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు. ► నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా. ►ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. ►గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం. ►టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది. ►చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు ► మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం. ►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి. ►గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం. ►గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం. ►అందరికీ నమస్కారం, ఒక చక్కటి కార్యక్రమం, మానవతా దృక్పదంతో పది మంది పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ►మత్స్యకార భరోసా అనేది కులవృత్తులను నమ్ముకుని ప్రాణాలు ఫణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద సమయంలో ఆదుకునేందకు ప్రభుత్వం ఇచ్చే సాయం ►గతం కంటే పదిరెట్లు అదనపు సాయం ఇది, జాతీయ స్ధాయిలోనే ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయనివిధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం ఇది. ►రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళుతున్నారు సీఎం జగన్ ►గత పాలన వల్ల ప్రజలంతా పూర్తిగా నష్టపోయారు, అత్యంత సుధీర్ఘ తీరప్రాంతం గల రాష్ట్రం, సీఎంగారు ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు, ఓడరేవులు పూర్తిచేస్తున్నారు, ఫేజ్ 1లో సగం పనులు పూర్తవుతున్నాయి ►నిజాంపట్నం హార్బర్‌కూడా దాదాపు 70 శాతం పూర్తయితే, ఈనాడులో దుర్మార్గంగా ఆర్టికల్స్ రాస్తున్నారు. ► దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ను, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆక్వా హ్యచరీస్‌ను రూ. 185 కోట్లతో 278 ఎకరాలలో దిండి గ్రామం వద్ద నిర్మాణానికి సీఎంగారు శంకుస్ధాపన చేశారు. ► మెరైన్ సెక్టార్‌ను ఆక్వారంగాన్ని ఆదుకుంటూ ముందుచూపుతో ముందుకెళుతున్నారు. ► మా నియోజకవర్గంలో కులవృత్తుల మీద ఆధారపడి జీవించేవారు అధికం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంతో పాటు సాగునీరు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ► మా బీసీ సామాజికవర్గంలో కార్యకర్త స్ధాయి నుంచి ఎదిగిన మాలాంటి వ్యక్తులకు అత్యున్నత రాజ్యసభలో కూర్చునే అవకాశం కల్పించిన గౌరవం, కీర్తి సీఎంగారికి దక్కుతాయి. ధన్యవాదాలు. ►బాపట్లలోని నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యాకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ►వైఎస్సార్ మత్స్యాకార భరోసా నిధుల విడుదల కార్యక్రమం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా నిజాంపట్నం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. దారిపొడవున సీఎం జగన్ కాన్వాయ్‌పై పూలు చల్లుతూ ప్రజలు ఘనంగా స్వాగతించారు. ►వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ►1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేయనున్నారు. ►చెప్పిన మాట ప్రకారం వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లింపు. ► ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు రూ.108 కోట్ల ఆర్థిక సాయం ► ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 10వేల చొప్పున సాయం . ►ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందజేత. సాక్షి, అమరావతి: వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉ.9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి తిరిగి మ.1.00కు ఇంటికి చేరుకుంటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ మత్స్యకార భరోసా.. వరుసగా ఐదో ఏడాది కూడా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు. గతంతో పోలిస్తే ఆరు రెట్లు అధికం.. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత రూ.4వేల చొప్పున ఇచ్చారు. అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50వేల మందికి రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భృతి రూ.10వేలకు పెంచడమే కాక.. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా చెల్లిస్తోంది. ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ఇక చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొ కుటుంబానికి సగటున రూ.50వేల చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.538 కోట్ల భృతిని అందించారు. డీజిల్ సబ్సిడీ గతం కంటే మిన్నగా.. టీడీపీ హయాంలో 1,100 బోట్లకు లీటర్ డీజిల్‌కు రూ.6 చొప్పున ఏటా సగటున రూ.12 కోట్లు ఆయిల్ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని రూ.9కి పెంచడమే కాక మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. విదేశీ జైళ్లలో మగ్గిన 23 మంది విడుదల వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు గత ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని రూ.10లక్షలకు పెంచింది. అంతేకాదు.. 2018లో పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడగా, 13 నెలల పాటు కరాచీ జైలులో మగ్గిన 23 మత్స్యకారుల విడుదల కోసం కనీస ప్రయత్నం చేయకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీరాగానే విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపింది. వారిని పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. మరోవైపు.. మత్స్యకారుల వలసల నివారణ, వారికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,767.48 కోట్లతో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, రూ.16వేల కోట్లతో నాలుగు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. తద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది. నేడు సీఎం జగన్ నిజాంపట్నం రాక సాక్షి ప్రతినిధి, బాపట్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా పర్యటనకు రానున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉ.11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు. లబ్ధిదారులతోనూ మాట్లాడతారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉ.9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి తిరిగి మ.1.00కు ఇంటికి చేరుకుంటారు. జీవనోపాధి కోల్పోయిన వారికి అండగా.. ఇక ఓఎన్జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్లు కూడా సీఎం జగన్ జమచేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి రూ.393.76 కోట్ల పరిహారం ఇచ్చారు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,43,649 మత్స్యకారులకు రూ.3,835.89 కోట్లు జమచేశారు. మరోవైపు.. ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా దేశీయ వినియోగం పెంచడంతోపాటు ఆక్వా రైతులకు, మత్స్యకారులకు మెరుగైన రేట్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2,184 రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక.. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. -
16న నిజాంపట్నంలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఖాతాల్లో వేట నిషేధ భృతిని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేసిన తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. గత నాలుగేళ్ల మాదిరిగానే వరుసగా ఐదో ఏడాది కూడా వేటపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. -
గంగపుత్రులకు ‘భరోసా’.. భారీగా పెరిగిన అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి పంపిణీకి ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1,23,519 మంది అర్హత పొందగా, వారికి ఈనెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రూ.123.52 కోట్లు జమచేయనున్నారు. గతంలో అరకొరగా సాయం రాష్ట్రంలో తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. వేట నిషేధ వేళ గతంలో రూ.2వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చేవారు. ఆ తర్వాత నిత్యావసరాలు నిలిపివేసి రూ.4వేల చొప్పున భృతి ఇచ్చేవారు. అది కూడా వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాక.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో పాటు సంప్రదాయ నావలపై ఆధారపడి జీవించే వారికి సైతం నిషేధకాలం ముగియకుండానే భృతినందిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ కారణంగా బోట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2019–20 నాటికి రాష్ట్రంలో అన్ని బోట్లు కలిపి 14,299 ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాల సంఖ్య 1.60 లక్షలకు చేరింది. ఐదు రెట్లు పెరిగిన సాయం వేట నిషేధం అమలులోకి వచ్చిన వెంటనే అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఆర్బీకేల్లో పనిచేసే మత్స్య సహాయకులు, వలంటీర్, సాగర మిత్రలతో కూడిన బృందాలు లబ్ధిదారుల గుర్తింపునకు శ్రీకారం చుట్టాయి. తీరానికి చేరుకున్న బోట్లను పరిశీలించి, వాటిపై జీవనోపాధి పొందే మత్స్యకార కుటుంబాలను గుర్తించారు. ఆరు దశల వెరిఫికేషన్ అనంతరం అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది జాబితాలను ప్రకటించారు. ఈ విధంగా 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో బీసీలు 1,17,757 మంది, ఎస్సీలు 2,946, ఎస్టీలు 970, ఓసీలు 1,846 మంది ఉన్నారు. వీరి వివరాలను సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.123.52 కోట్లను ఈనెల 16న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమచేయనున్నారు. కానీ, టీడీపీ ఐదేళ్ల పాలనలో భృతికింద 3 లక్షల మందికి రూ.104.62 కోట్లు ఇస్తే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జమచేయనున్న మొత్తంతో కలిపి ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర సాయమందించింది. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే లబి్ధదారుల సంఖ్య 2.38 లక్షల మేర పెరిగితే, సాయం ఐదు రెట్లు పెరిగింది. మాటల్లో చెప్పలేను.. మా బంధువుకు చెందిన తెప్పపై ఆధారపడి 20 ఏళ్లుగా జీవిస్తున్నా. వేటలేని సమయంలో ఏనాడు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా రూ.10వేల చొప్పున అందిస్తున్న సాయం అక్కరకొస్తోంది. ఎలాంటి పైరవీల్లేకుండా ఎంపిక చేస్తున్నారు. – వై.అప్పలరాజు, రాజయ్యపేట, అనకాపల్లి జిల్లా వరుసగా ఐదో ఏడాది భృతి గడిచిన నాలుగేళ్లుగా వేట నిషేధ కాలం ముగియకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద భృతినందించాం. అదేవిధంగా ఐదో ఏడాది కూడా సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1.23 లక్షల కుటుంబాలు అర్హత పొందగా, వారి ఖాతాల్లో ఈనెల 16న వేట నిషేధ భృతిని జమచేసేందుకు ఏర్పాట్లుచేశాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న బోట్లు డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అర్హుల గుర్తింపునకు బృందాలు ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. అర్హులు వీరే.. ♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు. ♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి. ♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. ♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. -
మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు రూ.418 కోట్ల సాయం అందించాం
-
వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం (ఫొటోలు)
-
మత్స్యకారులకు ఖాతాల్లోకి రూ.109 కోట్లు జమ చేసిన సీఎం జగన్
-
గత ప్రభుత్వానికి.. మన ప్రభుత్వానికి తేడా అదే..
-
ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అస్సలు నచ్చదు: సీఎం జగన్
-
ఇదీ మా ఘనత.. ధైర్యంగా చెబుతున్నాం: సీఎం జగన్
ఎంతగానో మంచి చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది. కాబట్టే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఇంటి వద్దకు బయలు దేరారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఈ 34 నెలల కాలంలో మీ ఇంటికి ఏయే పథకాలు అందాయో ఆ కుటుంబంలో ఉన్న అక్కచెల్లెమ్మల పేరుతో నేను స్వయంగా రాసిన లేఖలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్ర మానికి శ్రీకారం చుట్టాం. బాబు ఏం మేలు చేశారో ఇంత ధైర్యంగా ఆ దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు చెప్పగలరా? పేదవాళ్లకు మంచి చేయడానికి రాష్ట్రానికి డబ్బులు రావడాన్ని కూడా ఈ దుష్టచతుష్టయం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా బాధే. బ్యాంకులు అప్పులు ఇచ్చినా బాధే. ఢిల్లీ దాకా కోర్టుల్లో అన్ని చోట్లా అబద్ధాలతో కూడిన పిటిషన్లు వేస్తూ నిరంతరం అడ్డుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి రాబందులను ఏమనాలి? ద్రోహులు అందామా? లేక దేశ ద్రోహులు అందామా? కళ్లు ఉండి మంచిని చూడలేని కబోదులు అందామా? – సీఎం వైఎస్ జగన్ మురమళ్ల నుంచి సాక్షి ప్రతినిధి: ‘మన ప్రభుత్వ మూడేళ్ల పాలనలో 32 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం. మేనిఫెస్టోలో 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. డీబీటీ ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశాం. ఇంతగా మంచి చేశామని ప్రజలకు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇలా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం అతని దత్తపుత్రుడుకీ లేదు. దుష్టచతుష్టయంలో భాగమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియాకు అసలే లేదు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మంచి పనులు చేస్తుంటే వారికి ఈర్ష్య, కడుపు మంట అన్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని, అయితే ఈ కడుపు మంట, ఈర్ష్యకు మందు లేదని.. ఆ దేవుడే చూడాలన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం నాలుగో ఏడాది మత్స్యకార భరోసాతోపాటు ఓఎన్జీసీ నష్ట పరిహారం రూ.217 కోట్లను సీఎం జగన్.. కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మత్స్యకారులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గ్రామ స్వరూపమే మారిపోతోంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదరికంలో ఉన్న వారిని నా వాళ్లగా భావించాను. వారి ఎదుగుదల కోసం 32 పథకాలను అమలు చేస్తున్నాం. వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మఒడి, చేయూత, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా కానుక, వసతి దీవెన ఇలా వివిధ పథకాల ద్వారా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధి చేకూరుస్తున్నాం. ► మరో వైపు మన గ్రామాల స్వరూపాలన్నీ మారిపోతున్నాయి. ప్రతి ఊళ్లో మన కళ్లెదుటే ఇంగ్లిష్ మీడియం స్కూలు నాడు–నేడుతో ముస్తాబై కనిపిస్తోంది. అదే గ్రామంలో ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. వ్యవసాయం రూపురేఖలు మార్చే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. ► ఇంకో నాలుగు అడుగుల దూరంలో 24 గంటల పాటు సేవలందించే విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే లంచాలు, వివక్ష లేని సేవలందిస్తూ గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి. ఇంతటి మంచి, అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి, గత చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఒక్కసారి తేడా గమనించాలని కోరుతున్నా. ► ‘మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు సంబంధించి 95 శాతం అమలు చేశాం. ఈ మేనిఫెస్టోలో మీరే చూసి, టిక్కులు పెట్టండి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా మీరే చూడండి’ అని మీ చల్లని దీవెనలు తీసుకునేందుకు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ దగ్గరకు బయలుదేరారు. ► ఇంతగా మంచి చేస్తున్న మన ప్రభుత్వాన్ని దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లను ఎక్కడైనా చూశారా? ► పరీక్ష పేపర్లు లీక్ చేసే వ్యక్తిని సమర్థించే ప్రతిపక్షం కానీ, సమర్థించే ఎల్లో మీడియా కానీ, ఇలాంటి దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా? ► కార్మిక శాఖ మంత్రిగా ఈఎస్ఐకి సంబంధించి ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి.. పౌడర్లు, స్నోలు, టూత్‌పేస్టులు, మందులు పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడ్ని విచారించడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాన్ని కానీ, ఎల్లో మీడియాను కానీ, ఇటువంటి దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా? ► మన పిల్లలకు మనం అబద్ధాలు చెప్పొద్దని, మోసం చేయవద్దని నేర్పుతాం. కానీ కొడుక్కు పచ్చి అబద్ధాలు, మోసాల్లో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి, మంగళిగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండుచోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. ప్రజలను కాక ఇలాంటి వాళ్లను నమ్ముకుంటున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబులాంటి రాజకీయ నాయకుడ్ని ఎక్కడైనా చూశారా? ► వాళ్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా, మనం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా? ► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్లు కట్టించి ఇవ్వాలని.. వీరు చెప్పుకుంటున్న అమరావతి అనే రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఏకంగా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటారు. వీళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే జనాభా సమతుల్యం (డెమోగ్రాఫిక్ ఇంబేలన్స్) దెబ్బతింటుంటుని పిటిషన్లు వేసి వాదిస్తారు. ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా? ► ప్రభుత్వ స్కూళ్లల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పెడితే, అడ్డుకున్న ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా? పేద పిల్లలు పెద్ద చదువులు చదుకుకుని గొప్పవాళ్లయితే చంద్రబాబు లాంటి వాళ్లను ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయపడే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశామా? ► మన ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక అబద్ధాలు గుమ్మరిస్తున్నారు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) 27 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఆయనకు ఏ రోజూ రాలేదు. ఈ రోజు మన మూడేళ్ల పాలన చూసి భయంతో కుప్పం వెళ్లారు. అక్కడ ఇల్లు కట్టుకునే పని చేస్తున్నారు. ఇలాంటి వక్రబుద్ది ఉన్న దుష్ట›చతుష్టయం నుంచి, నేతల దేవుడు రాష్ట్రాన్ని కాపాడాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే సతీష్
-
సీఎం జగన్‌కు కోనసీమ ఘన స్వాగతం
-
LIVE: వైఎస్ఆర్ మత్స్యకార భరోసా.. సీఎం జగన్ @ కోనసీమ జిల్లా
-
మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి సొమ్ము