
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించారు.ఐ.పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.