Breadcrumb
- HOME
గత పాలన-మన పాలన.. తేడా గమనించండి: సీఎం జగన్
Published Fri, May 13 2022 10:12 AM | Last Updated on Fri, May 13 2022 5:04 PM
Live Updates
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ: సీఎం జగన్
మురమళ్లలో నిర్వహించిన మత్స్యకారభరోసా బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమచేశారు. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేశారు.దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలిగింది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.
దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు నిజం చెప్పే ధైర్యం లేదు
మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదు. దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా ధైర్యం లేదు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశాం. నిజాయితీ, నిబద్ధతో ప్రజల ముందుకు వస్తున్నాం. దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. నలుగురికి తోడు వీరి దత్తపుత్రుడు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారు. పేపర్ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ఈఎస్ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీళ్లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా అని సీఎం జగన్ అన్నారు.
కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా?. కోర్టుకు వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదు.
జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు: సీఎం జగన్
మన ప్రభుత్వం వచ్చాక డీజిల్‌పై సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచాం. స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్ కొనేటప్పుడే సబ్సిడీ సొమ్ము మినహాయింపునిస్తున్నాం. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. మత్స్యకారులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు.
గత ప్రభుత్వానికి.. మన ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్
మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించండి. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, గీతగా భావించాం.
23,548 మంది మత్స్యకారులకు రూ.108 కోట్ల పరిహారం
వేట కోల్పోయిన 23,548 మంది మత్స్యకారులకు ఓఎన్జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నాం. జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకారు కుటుంబాలకు రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓఎన్జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నాం.
వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా అందిస్తున్నాం: సీఎం జగన్
కోనసీమ: వైఎస్సార్ మత్స్యకార భరోసా సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాదాపు లక్షా తొమ్మిదివేల మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నాం. అందులో భాగంగానే వరుసగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున.. ఈ ఏడా 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్లు రోజు జమ చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశాం.
తీరప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా పరిహారం: మంత్రి అప్పలరాజు
మత్స్యకార జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపుతున్నారని పశుసంవర్థక, మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు భరోసా అందిస్తున్నారు. తమిళనాడులో ఐదు వేలు, ఒడిశాలో కేవలం 4 వేలు ఇస్తున్నారు. తీరప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో పరిహారం అందిస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు.
బీసీల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు: పొన్నాడ సతీష్
కోనసీమను జిల్లాగా చూడాలన్న జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేట నిషేదిత సమయంలో మనం అందిస్తున్న భరోసాను చూసి సీఎం జగన్‌ను మత్స్యకారులు వారింట్లో వ్యక్తిగా చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను అసలు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సహకారంతో ఓఎన్జీసీ నష్టపరిహారం అందుతోందన్నారు.
చేతి వృత్తులవారు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే కారణం సీఎం జగన్ అని అన్నారు. రాజకీయంగా పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినందుకు బీసీల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం జగన్
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి.. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా సభా ప్రాంగణంలో సీఎం జగన్‌తో ఉన్నారు.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా.. సీఎం జగన్ @ కోనసీమ జిల్లా
కోనసీమ జిల్లా మురుమళ్ల చేరుకున్న సీఎం జగన్
కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మ) మురమళ్ల గ్రామానికి సీఎం జగన్ చేరుకున్నారు. మరికాసేపట్లోనే ఈ సభ జరిగే ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మత్స్యశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్ పరిశీలిస్తున్నారు. అధికారులు స్టాల్స్ గురించి వివరిస్తున్నారు.
సీఎం జగన్‌కు ఘనస్వాగతం
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొమరగిరి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో మురమళ్లలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) భరోసాను ప్రారంభిస్తారు. హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ.. ఎంపీలు చింతా అనురాధ, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు ఘనస్వాగతం పలికారు.
మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి సొమ్ము
జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలిలా..
1,08,755 కుటుంబాలకు రూ.109 కోట్లు
ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.
కోనసీమ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సీఎం జగన్ వెంట మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ ఉన్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Related News By Category
Related News By Tags
-
ఇదీ మా ఘనత.. ధైర్యంగా చెబుతున్నాం: సీఎం జగన్
ఎంతగానో మంచి చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది. కాబట్టే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఇంటి వద్దకు బయలు దేరారు. మనం అధికారంలోక...
-
కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించారు.ఐ.పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వైఎస్సార్ మత్స...
-
ఈనెల 13న కోనసీమకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నూతనంగా జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా కోనసీమలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు ఈనెల 13న ఐ.పోలవరం మండలం మురమళ్ళలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందజేయనున్నారు. రాష్ట్రంలో లక్ష 19...
-
Asani Cyclone Effect: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసని తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్...
-
గంగపుత్రులకు ఏదీ భరోసా?
సాక్షి, అమరావతి : వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలవుతుంది. ఈ సమయంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వేట తప్ప వారికి మరో వృత్తి చేతకాదు. వేటకు వెళ్తే కానీ...
Comments
Please login to add a commentAdd a comment