muramalla
-
వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం (ఫొటోలు)
-
గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే సతీష్
-
సీఎం జగన్కు కోనసీమ ఘన స్వాగతం
-
LIVE: వైఎస్ఆర్ మత్స్యకార భరోసా.. సీఎం జగన్ @ కోనసీమ జిల్లా
-
మత్స్యకారులకు గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సొమ్ము
-
గత పాలన-మన పాలన.. తేడా గమనించండి: సీఎం జగన్
-
వీరేశ్వరుని బ్రహ్మోత్సవం
కన్నుల పండువగా ప్రారంభం ఐ.పోలవరం : నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోన్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈపూజా కార్యక్రమం శైవాగమ పద్ధతిలో శైవాగమ పండిట్ స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల పర్యవేక్షణలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామి వారికి అభిషేకం, స్వామి, అమ్మవారిని నూతన వధూవరూలను సంప్రదాయ పద్ధతిలో చేశారు. పండితులు, స్వామి, అమ్మవారికి అలంకరించే పట్టు వస్త్రాలను జంపన రామకృష్ణంరాజు దంపతులు అందించారు. గ్రామంలోని మహిళలు పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి పసుపును తయారు చేశారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి, అమ్మవారికి స్నానాలు చేయించారు. అనంతరం సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, సాయంత్రం అయ్యవారిని, అమ్మవారిని భద్ర పీఠంపై ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవం జరిగింది. అనంతరం ఎదురు సన్నాహం, స్వామివారిని ద్వాదశ ప్రదక్షణగా ఆలయ ప్రదిక్షణ చేశారు. స్వామి, అమ్మవారికి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరు అయ్యారు. ఆలయ చైర్మ¯ŒS జంపన భీమరాజు, ఈఓ బళ్ల నీలకంఠం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వీరేశ్వరుని ఆలయానికి లక్షదీప శోభ
ఐ.పోలవరం : మురమళ్లలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం లక్షదీప శోభతో మెరిసిపోయింది. కార్తిక మాసం చివరి రోజైన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అశేషజనవాహినితో ఆలయం కిటకిటలాడింది. లక్ష దీపాలంకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్టింగు భక్తులను ఎంతో ఆకట్టుకొంది. లోపల, బయట భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం కొత్త కాంతులను అద్దుకొంది. ఆలయ ఆవరణలో శివలింగం, త్రిశూలం, సూర్యుడు, ఓంకారం తదితర ఆకృతుల్లో దీపాలను వెలిగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పూజలు నిర్వహించారు. దీపోత్సవం విశిష్టత గురించి పరిపూర్ణానందస్వామి శిషు్యరాలు గీతావాణి చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.