సాక్షి, బాపట్ల: నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష టీడీపీ, జనసేనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పనవ్ కల్యాణ్‌కు పొలిటికల్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనేనని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదని.. ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని అన్నారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు.
వెంటిలేటర్‌పై బాబు పార్టీ
చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే జూబ్లీహిల్స్‌లో ఉంటాడని సీఎం జగన్ దుయ్యబట్టారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని మండిపడ్డారు. అయితే ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని.. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషికి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు.
చదవండి: 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు, ప్రజల తరపున నిలబడ్డా, మంచి చేస్తున్నా: సీఎం జగన్
సీఎం పదవి వద్దు, దోపిడిలో వాటా చాలు..
‘రెండు చోట్ల పోటీచేస్తే.. మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్లా కూడా దత్తపుత్రుడ్ని ప్రజలు ఓడించే పరిస్థితి. 10 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు సీఎం పదవి వద్దు.. దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడు. గజదొంగల ముఠాగా దోచుకోవడానికి వీరంతా కలుస్తున్నారు. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.
5 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు.
ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు. పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే.
చంద్రబాబు చెప్తే.. దత్తపుత్రుడు చిత్తం ప్రభూ అంటాడు.
చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అదే చేస్తానంటాడు దత్తపుత్రుడు. ఏ పార్టీని కలవాలో దత్తపుత్రుడికి చంద్రాబాబే చెప్తాడు. బాబు చెప్తే దత్తపుత్రుడు బీజేపీ పక్కన చేరతాడు. చంద్రబాబు బీజేపీకి విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 గజదొంగల ముఠా సభ్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు చక్రం తిప్పుతున్నారని రాస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపని పండగ చేసుకుంటారు. కర్ణాటకలో ఓడిన బీజేపీని తమతో కలిసి రావాలని వీళ్లే కోరతారు. వీరు చేస్తుంది జగన్‌తో కాదు జనంతో యుద్ధం. వీరు చేస్తుంది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వారికి లేదు.
చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు వీర్రవీగారు.. ఇప్పుడేమైంది..
ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.
ప్రతి సామాజిక వర్గంలో కూడా ప్రతి పేదవారిని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి.. మీ బిడ్డ వారికోసం అనేక చర్యలు తీసుకుంటున్నాడు. అందుకే మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. దత్తపుత్రుడు షూటింగ్‌లకు విరామ సమయంలో బయటకు వస్తాడు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment