
సాక్షి, అమరావతి: అలలతో పోటీపడుతూ నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేటనిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక చేయూతనిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 1,19,875 కుటుంబాలకు రూ.130.46 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
2019లో 1.02 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.102 కోట్లు ఇవ్వగా, 2020లో 1.09 లక్షల కుటుంబాలకు రూ.109 కోట్లు సాయమందించారు. ఈ ఏడాది మొత్తం 1,19,875 మందిని అర్హులుగా తేల్చగా ఇందులో బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. వలంటీర్ల ద్వారా ఇంకా అర్హులెవరైనా ఉన్నారేమోనని ప్రభుత్వం గుర్తిస్తోంది. కాగా ఈ నెల 18న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
చదవండి: కోవిడ్ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్ జగన్
వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు
Comments
Please login to add a commentAdd a comment