సాక్షి, విశాఖపట్నం: అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లపై బీజేపీ నేత జివీల్ నరసింహారావు స్పష్టతనిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 వేల కోట్లు రూపాయలు అప్పేనని తేల్చి చెప్పేశారు. ఈ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని.. అప్పు కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా? అనే దానిపై మీద స్పష్టత రావాలన్నారు.
కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సాయమా లేక అప్పా అనేది చెప్పకుండా సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించిన సంగతి తెలిసిందే. రుణమా లేక గ్రాంటా అనేది స్పష్టంగా ప్రకటించకుండా బీజేపీ నాయకత్వం పదాల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. మన రాష్ట్రం విషయంలో ఉత్తి మాటలు చెప్పిన కేంద్రం.. బీహార్‌కి మాత్రం భారీగా నిధులను కేటాయించింది. అధికార పార్టీ ఎంపీలు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని, ఏం సాధించారని పలువురు నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment