సాక్షి, అమరావతి: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తున్న నిధులపై బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ కేంద్రం ప్రకటించిన నిధులపై శ్వేతపత్రాలు విడుదల చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏపీ నిధులపై బీజేపీ బహిరంగ చర్చలకు రావాలని మంత్రి గంటా సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచీ టీడీపీ, బీజేపీ నేతలు నిధుల అంశంపై ముకుమ్మడిగా డ్రామాలాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్వేతపత్రం నాటకాన్ని ఏపీ సర్కార్ తెర మీదకు తెస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధుల అంశానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులు, వ్యయాలపై నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీతో పాటు ఇతర పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజల అనుమానాలను తొలగించేందుకు ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment