CM YS Jagan Tweet On Matsyakara Bharosa - Sakshi
Sakshi News home page

మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్వీట్

May 16 2023 6:38 PM | Updated on May 16 2023 7:13 PM

CM YS Jagan Tweet On Matsyakara Bharosa - Sakshi

తాడేపల్లి: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా మంగళవారం అయిదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. అనంతరం మత్స్యకార భరోసాపై సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టి నాలుగేళ్ల లోపే ఐదు విడతలనూ పూర్తి చేశాం. ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ. 50 వేలను అందజేశాం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి: జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం

బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్‌ గాలి తీసేసిన సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement